
*స్వచ్చంధంగా సేవ చేస్తున్న వాలంటీర్లపై బురదచల్లడం సరికాదు : ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*
*: ఓట్ల చేర్పులు, తొలగింపులు వాలంటీర్ల పాత్ర ఏమైనా ఉందా*
*; గుర్తింపు కోసం ఇలాంటి చవకబారు ఆరోపణలు తగదు*
: ఆనం రామనారాయణ రెడ్డి పై ఫైర్.
*రాష్ట్ర ప్రభుత్వం అందచేస్తూ స్వచ్చంధంగా సేవ చేస్తున్న వాలంటీర్లపై వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి విమర్శలు చేశారని, వారు చేస్తున్న సేవలు రాష్ట్ర ప్రజలందరికి తెలుసునని, అటువంటి వాలంటీర్లపై బురద చల్లడం సరికాదని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.*
*సంగం పీయేసీయస్ కార్యాలయం ఆవరణలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజలందరి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేలా కృషి చేస్తున్నామని, ఈ కార్యక్రమం గత సంవత్సరం రోజులుగా కొనసాగుతుందని, ఈ కార్యక్రమానికి ముందు వాలంటీర్లతో, నాయకులతో సమీక్ష నిర్వహించుకుంటూ వస్తున్నామని అన్నారు.*
*అంతేకాక ఆత్మకూరు నియోజకవర్గంలో రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు వాలంటీర్, వీఆర్ఓలను ప్రతి గడపకు వెళ్లి రెవెన్యూ సమస్యలను తెలుసకుని జాబితాలను సిద్దం చేయాలని సూచించి ఉన్నామని, వాటిని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.*

*ఇటీవల గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మున్సిపల్ పరిధిలో ముగిసినప్పుడు అన్ని సచివాలయాల వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని పిలిచి ఇప్పటి వరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఇంకా సమస్యలు ఏమైనా ఉన్నాయా అని కార్యక్రమాన్ని నిర్వహించామని, అదే విధంగా సంగం మండలంలో కూడా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముగుస్తున్నందున వాలంటీర్లు కార్యక్రమంపై సమావేశం నిర్వహిస్తుండడం జరిగిందిన అన్నారు.*
*సంగం వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయంలో ఇలా సమావేశం నిర్వహిస్తుంటే ఎలాంటి సంబంధం లేని పక్క జిల్లాలో ఎమ్మెల్యే అయిన ఆనం రామనారాయణరెడ్డి సమావేశానికి వచ్చి పలు ఆరోపణలు చేయడం జరిగిందని అన్నారు. వాలంటీర్లు, నాయకులు ఓట్లను తొలగిస్తున్నారంటూ ఆరోపణ చేసిన ఆనం రామనారాయణరెడ్డి వాలంటీర్లు, నాయకులకు ఇలా ఓట్లను తొలగించే అధికారం లేదనే విషయం తెలియకపోవడం శోచనీయమన్నారు.*

*సెలవు రోజుల్లో సమావేశాలు ఏంటని ఆరోపణలు చేసిన మీకు గత సంవత్సర కాలంగా ఆదివారాలు, సెలవు దినాల్లో సైతం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాలను నిర్వహించిన విషయం మీకు తెలియదు కదా, అందుకే ఇలాంటి ఆరోపణలు చేశారన్నారు. ప్రభుత్వం ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయా లేదా, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకునేందుకు ముందుగా సమావేశాలు నిర్వహిస్తుంటే ఎటువంటి సంబంధం లేని ఆనం రామనారాణరెడ్డి మమ్మల్ని ప్రశ్నించడం ఏంటన్నారు.*
*పక్క జిల్లాలో శాసనసభ్యుడిగా గెలిపించిన ప్రజలను మీరు వదిలేసి, వారి సమస్యలను పరిష్కరించకుండా ఆత్మకూరు నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ ప్రశ్నించడం ఏమిటన్నారు. ఓటర్ల తొలగింపుపై ఆరోపణలు చేస్తున్న మీరు జూలై 21 నుంఢి ఆగస్టు 21 వరకు అన్ని పార్టీలు బీయల్ఏలను, బీయల్ఓలను ఏర్పాటు చేసి ఓటరు రీ వెరిఫికేషన్ చేయడం జరిగిందన్నారు.*
*వీళ్లపై తహశీల్దారు, ఆర్డీఓలు ఉంటారని, ఫారం -7 ద్వారా ఆన్ లైన్ లో మాత్రమే ఓట్లు తొలగింపు సాధ్యమవుతుందని, ఓటు తొలగించేందుకు నివేదికలను ఆర్డీఓలకు అందించాల్సి ఉంటుందని, ఈ మొత్తం ప్రక్రియకు వాలంటీర్లకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. వాలంటీర్లు, నాయకుల ద్వారా ఓట్ల చేర్పులు, తొలగింపులు సాధ్యం కాదన్న విషయం తెలిసినా వారిపై ఆరోపణలు చేయడమే పనిగా ఇలాంటి కార్యక్రమాలను చేపట్టారన్నారు.*
*గత రెండు వారాలుగా మీడియా ద్వారా ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎవరూ లేరన్న విషయం తెలుసుకున్న మీరు ఇలాంటి ఆరోపణలు చేసి మీడియాలో ప్రముఖంగా మారుతామని ప్రయత్నించినట్లు అర్థమవుతుందన్నారు. సోసైటి కార్యాలయంలో సమావేశాలు నిర్వహించకూడదని మీరు చెబుతున్నారని, కానీ గతంలో మీరు పదేళ్ల శాసనసభ్యునిగా, మంత్రిగా పనిచేసిన సమయంలో సొసైటి కార్యాలయంలో ఎన్ని కార్యక్రమాలు నిర్వహించారో అందరికి తెలుసునన్నారు.*
*ఆనం రామనారాయణరెడ్డి సోసైటి కార్యాలయానికి వచ్చిన సమయంలో మా నాయకులు వారికి మర్యాద ఇచ్చి సమావేశం జరుగుతున్న తీరును వివరించారని, కానీ కిందకు వెళ్లి మీరు వాళ్లపైనే ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కిందనున్న వీఆర్ఓను పైకి తీసుకొచ్చి అతనిపై ఆరోపణలు చేయడం ఏంటన్నారు.*
*వాలంటీర్లు ఓట్ల తొలగింపు చేస్తున్నారని మీరు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్న విషయం మీకు తెలుసునని, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న మీకు ఓట్ల తొలగింపు ప్రక్రియ తెలియనిది కాదని, ఎక్కడా కనిపించడం లేదన్న ఒక్క కారణంతో ఇలాంటి కార్యక్రమాలు చేయడం సరికాదన్నారు.*
*పక్క జిల్లాలో ఎమ్మెల్యేగా ఉన్న మీరు క్రాస్ ఓటింగ్ కారణంగా వైఎస్సార్సీపీ నుండి బహిష్కరణకు గురయ్యారని, ఒక పార్టీలో ఉంటూ వేరే పార్టీకి ఓటు వేయడం నిజంగా రాజ్యాంగ విరుద్దమని అన్నారు. ఏ రోజు ఏ పార్టీలో మీరుంటారో తెలియదని, ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీకి మద్దతు ఇస్తారని, ఇలాంటి మీరు వాలంటీర్లను టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేయవద్దని అన్నారు.*
*రాష్ట్ర ప్రభుత్వం అందచేస్తున్న గౌరవ వేతనంతో స్వచ్చంధంగా సేవ చేస్తున్న వాలంటీర్లపై మీ స్వప్రయోజనాల కోసం ఆరోపణలు చేయడం సరికాదని, గతంలో అనేక సార్లు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి రావాలని ఆహ్వనించడం జరిగిందని, మా ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నామని అన్నారు.*
*గత ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది, మన ప్రభుత్వంలో ఎంత సంక్షేమం అందించారో ప్రజలందరికి తెలిపేందుకు ముందుగా నిర్వహించుకునే సమీక్షలను అడ్డుకుని ఇలాంటి ఆరోపణలు చేయడం మీ స్థాయికి తగ్గ విషయం కాదని, ఇది మీరు గుర్తుంచుకోవాలన్నారు.*
Comments are closed.