చెన్నై ప్రతినిధి: ప్రముఖ నటుడు’ మక్కల్ నీతి మైయం, పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ కొద్దిసేపు క్రితం ్ ప్రముఖ నటుడు ,స్నేహితుడు అయినా రజినీకాంత్ ని కలవడం జరిగింది. గత కొంతకాలం క్రితం గా రజినీకాంత్ విశ్రాంతిలో ఉన్నారు.
హైదరాబాదులో ఒక సినిమా షూటింగ్ లో ఉండగా అస్వస్థతకు లోనైన టువంటి రజినీకాంత్ అప్పటి నుంచి విశ్రాంతిలో ఉన్నారు. ఈ మధ్యనే ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా తన కొత్త స్టూడియో ని ప్రారంభించిన సందర్భంగా రజిని వెళ్లి మర్యాదపూర్వకంగా ఇళయరాజా నీ కలిసి తన శుభాకాంక్షలు తెలియజేశారు రజినీకాంత్. అయితే ఈ పరిస్థితుల్లో కమల్ హాసన్ రజినిల భేటీ ఆంతర్యం ఏమిటనేది ఇంకా తెలియ రాలేదు. మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల ఉన్నందున ఈ భేటీకి ప్రాముఖ్యత చేకూరింది . అయితే రజినీకాంత్ గత కొన్ని రోజుల క్రితమే ఆరోగ్య కారణాల రీత్యా నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను అని, పార్టీ నీ కూడా పెట్టారు అని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కమల్ హాసన్ కేవలం రజిని ఆరోగ్యం గురించి పరామర్శ కి వెళ్లారా లేదా ఇంకా ఏమైనా రాజకీయ చర్చలు జరిపారు అనేది తెలియాల్సి ఉంది.
Comments are closed.