అమరావతి: కరోనా సెకండ్ వేవ్ ఇంక తగ్గుముఖం పడుతుంది అని అనుకుంటున్న సమయంలో 3 వేవ్ సంకేతాలు కనిపిస్తున్నాయి అంటున్నారు విశ్లేషకులు. ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో క్రమంగా కేసులు పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కేసుల విషయంలో ఎక్కడా అనుమానం కలిగిన దానికి తగ్గట్టుగా వ్యవహరిస్తున్నారు. అందుకే కొన్ని ప్రాంతాల్లో ఆకాంక్షలు పొడుస్తున్నారు. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవడం తో అక్కడ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు ఆంక్షలు విధిస్తున్నారు. గత 20 రోజులుగా 11 వేల కేసులు నమోదయ్యాయి అంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే జిల్లా మొత్తాన్ని ఒక గాడిన కట్టకుండా ఏ ఏ ప్రాంతాల్లో కేసులు అధికంగా ఉన్నాయో అక్కడ మాత్రమే ఆంక్షలు కొనసాగిస్తున్నారు అధికారులు. ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే కావలి డివిజన్లో కేసులు పెరుగుదల ఎక్కువగా ఉండడంతో స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి చొరవచూపి వ్యాపారులతో మాట్లాడి సాయంత్రం ఐదు వరకే షాపులు తెరిచి విధంగా మాట్లాడారు. దీనికి వ్యాపారులు సానుకూలంగా స్పందించి ఐదు గంటలకు స్వచ్ఛందంగా మూసివేస్తామని ఎమ్మెల్యే కి తెలిపారు. ఇంకా జిల్లాలోని పెద్ద చెరుకూరు చిన్న చెరుకూరు సమీపంలో 100 కేసు నమోదు కావడం తో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో 3 వేవ్ మొదలైతే ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొన్ని రోజుల క్రితమే అధికారుల్ని సమాయత్త పరిచారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి అనవసరంగా బయటికి తిరగవద్దు అని అధికారులు సూచిస్తున్నారు.



Comments are closed.