- నిజమైన ప్రజానేతగా మన్ననలందుకుంటున్న బీహార్ సీపీఐ ఎమ్మెల్యే మహబూబ్
- సమీప ప్రత్యర్థిపై 53 వేల ఓట్ల మెజారిటీతో విజయం
- మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించిన వారిలో 81 శాతం మంది కోటీశ్వరులే
ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు తరతరాలకు తరగనంత ఆస్తి సంపాదిస్తున్న ఈ రోజుల్లో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా ఉండేందుకు గూడు కట్టుకోలేకపోయారు బీహార్‌కు చెందిన సీపీఐ ఎమ్మెల్యే మహబూబ్ ఆలం (44). బీహార్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కటిహార్ జిల్లాలోని బలరామ్‌పూర్ సీటు నుంచి నాలుగోసారి విజయం సాధించిన మహబూబ్.. నిజమైన ప్రజానేతగా ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. ఆయన ఎక్కడికి వెళ్లాలన్నా ఇప్పటికీ నడుచుకునే వెళ్తుండడం మరో ప్రత్యేకత.
బీహార్ ఎన్నికల్లో విజయం సాధించిన వారిలో 81 శాతం మంది కోటీశ్వరులుండగా, సొంతిల్లు కూడా లేని ఎమ్మెల్యే ఈయన ఒక్కరే. పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్న మహబూబ్ మొన్నటి ఎన్నికల్లో 53 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆయన ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
Comments are closed.