సౌత్ 9 ప్రతినిధి :
ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ను మర్యాదపూర్వకంగా కలిసిన మనపాటి చక్రవర్తి.
అమరావతి :
డిసెంబర్ 3న నెల్లూరు నగరంలో వినోద్ ఫౌండేషన్ మరియు
ద సౌత్ 9 మీడియా ఆధ్వర్యంలో జరగబోయే కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనితని వినోద్ ఫౌండేషన్ ఫౌండర్ చక్రవర్తి ఆహ్వానించడం జరిగింది.
ఈ సందర్భంగా వినోద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేసిన సేవా కార్యక్రమ విశేషాలకు సంబంధించిన బ్రోచర్ని హోం మంత్రికి అందజేశారు.
వినోద్ ఫౌండేషన్ మరియ. ద సౌత్ 9 మీడియా ఆధ్వర్యంలో జరిగిన పలు సేవా కార్యక్రమాలు గురించి కార్యక్రమ నిర్వాహకుల్ని అభినందించారు. ఇలాగే సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించాలని వినోద్ ఫౌండేషన్ ఫౌండర్ మన పాటి చక్రవర్తికి హోం శాఖ మంత్రి అనిత సూచించారు.
డిసెంబర్ 3న నెల్లూరు నగరంలో చేపట్టబోతున్న కార్యక్రమానికి తప్పక హాజరవుతానని ఈ సందర్భంగా అన్నారు.
Comments are closed.