
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్ట్ రామ్మోహన్ ఇంటికి వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి, ఆయనకు తగిన చికిత్స చేయిస్తానని హామీ ఇచ్చారు. ఓ పక్క సినిమా షూటింగ్, మరోపక్క నీహారిక పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ, రామ్మోహన్ గురించి తెలుసుకున్న ఆయన, రామ్మోహన్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఏఐజీ ఆసుపత్రిలో మెరుగైన చికిత్సకు ఏర్పాటు చేయిస్తానని అన్నారు.

తాను ప్రజారాజ్యం పార్టీని పెట్టిన సమయంలో పార్టీ కోసం ఆయన పనిచేశారని గుర్తు చేసుకున్నారు. ఓ నిజాయితీ గల పాత్రికేయుడిగా రామ్మోహన్ తనకు చాలా సంవత్సరాలుగా తెలుసునని అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు చిరంజీవి వ్యాఖ్యానించారు.
Comments are closed.