The South9
The news is by your side.

స్థానిక ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించలేం: ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి

post top

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా ఆగిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అన్ని పార్టీలతో సమావేశాన్ని నిర్వహించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ప్రకటించడంతో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.ఈ నేపథ్యంలో మంత్రి గౌతమ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా ప్రభావం కొంచెం తగ్గినట్టు కనిపిస్తున్నప్పటికీ, మళ్లీ వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారని, ఈ నేపథ్యంలో నవంబర్ లో ఎన్నికలను నిర్వహించే పరిస్థితి లేదని ఆయన చెప్పారు.

after image

వచ్చే నెలలో కేసులు పెరిగే అవకాశం ఉండొచ్చని గౌతమ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బీహార్ వంటి రాష్ట్రాల్లో జరుగుతున్నవి అసెంబ్లీ ఎన్నికలని, అందువల్ల వాటి నిర్వహణ తప్పనిసరి అని చెప్పారు. మన దగ్గర జరుగుతున్నవి స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో కొంత వెసులుబాటు ఉంటుందని తెలిపారు. ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని తెలిపారు.
Tags: Mekapati Goutham Reddy, Local Body Polls, YSRCP

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.