తెడ్డుతో పడవ నడుపుతూ సంగం మండలంలోని వీర్లగుడిపాడు గ్రామంలో పరిస్థితిని సమీక్షించిన మంత్రి మేకపాటి
మంత్రి వస్తున్నారని తెలిసి ఊరి జనమంతా గట్టున నిలబడి ఎదురుచూసిన వైనం
నిండా మునిగిన గ్రామాన్ని చూసి చలించిపోయిన మంత్రి మేకపాటి
చిన్న వానకే మునిగిపోయే గ్రామానికి పెద్ద వరద ఇబ్బంది పెట్టిందని వాపోయిన గ్రామస్తులు
వర్షాలు వచ్చినప్పుడన్నా సురక్షిత ప్రాంతాలకు రావాలి కదా , ప్రమాదం జరిగితే ఎలా అన్న మంత్రి మేకపాటి
తాతల కాలం నుంచి వానలు, వరదలు మాకు మామూలే సారూ అంటూ బదులిచ్చిన వీర్లగుడిపాడు గ్రామస్తులు
ఎంత వరద వచ్చినా ఎటువంటి ప్రాణనష్టం జరగని విధంగా పటిష్ట చర్యలు
దాదాపు అందరినీ సురక్షిత ప్రాంతాలకు చేర్చినా ఇంకో 100 మందికి పైగా గ్రామంలో ఉండడంతో అక్కడికి స్వయంగా పడవ నడుపుతూ వెళ్లి పలకరించిన మంత్రి గౌతమ్ రెడ్డి
వీర్లగుడిపాడు గ్రామంలో ప్రజలకు భోజన సదుపాయాలు, ఇతర అత్యవసరాలపై పడవలోనే అధికారులతో చర్చించిన మంత్రి
ఎంతో శ్రమకోర్చి యేరులా మారిన ఊరికి పడవ నడుపుతూ తమ కోసం మంత్రి స్వయంగా రావడంతో ప్రజల సంతోషం,హర్షం
ఇకపై ఎలాంటి సమస్య లేకుండా గ్రామస్తుల రాకపోకలకు అనువుగా బ్రడ్జి కట్టిస్తానన్న మంత్రి గౌతమ్ రెడ్డి
వీర్లగుడిపాడుకు బ్రిడ్జి ఎలా కడితే సమస్యకు శాశ్వత పరిష్కారం ఉంటుందో పరిశీలించిన మంత్రి
వరద వస్తున్న నేపథ్యంలో ముందు ముందు ప్రజలకు మంచినీరు, భోజన సదుపాయాలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడాలని ఆర్డీవోకు మంత్రి ఆదేశాలు
సంగం మండలంలోని వీర్లగుడిపాడు సందుసందులన్నీ కలియతిరుగుతూ పరిస్థితులను సమీక్షించిన మంత్రి మేకపాటి
అధికార యంత్రాంగం, నాయకులు, భగవంతునికి కృతజ్ఙతలు
ఏం భయపడొద్దని తక్షణ రక్షణ చర్యలు చేపడతామని మంత్రి భరోసా.
అంతకు ముందు పెన్నా నది ప్రవాహాన్ని పరిశీలించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
ఈ తరం చూడని పెన్నా ప్రవాహం అని మంత్రి వ్యాఖ్య
1995 తర్వాత పెన్నా నదికి వచ్చిన గరిష్ట వరద ఇదే
సముద్రాన్ని తలపిస్తోన్న పెన్నానది ప్రవాహం ప్రస్తుత వివరాలను అడిగి తెలుసుకున్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
డిసెంబర్ 25న ఇచ్చే ఇళ్ల పట్టాలతో పాటు అప్పారావుపాలెం ప్రజలకు పట్టాలిస్తానన్న మంత్రి గౌతమ్ రెడ్డి
కుండపోత వర్షాల వల్ల దెబ్బతిన్న ఇళ్లకు మరమ్మతులు, పంటపొలాలకు నష్టపరిహారంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్న మంత్రి
మంత్రిరాకతో తరలివచ్చిన అప్పారావుపాలెం గ్రామ ప్రజలు
నెల్లూరు చరిత్రలోనే ఇంత వరద పెన్నా నదికి లేదని మంత్రి వెల్లడి
పించా, చెయ్యేరు, స్వర్ణముఖి నదులు కూడా పెన్నాలో కలవడం వలనే పెన్నా మహోగ్రరూపం
ప్రస్తుత సమస్య దాటితే ఇక సస్యశ్యామలమే
జిల్లాలో పెన్నానదిపై 50 కి.మీ వద్ద సంగం ఆనకట్ట, 81 కి.మీ వద్ద నెల్లూరు ఆనకట్ట
అనంతసాగరం, కలువాయి, చేజర్ల, ఆత్మకూరు, సంగం మండలాలను తాకుతూ పెన్నా ప్రవాహం
2001లో 6 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోందని మంత్రికి తెలిపిన అధికారులు
2020లో 4.5 లక్షల క్యూసెక్కులుగా వివరాలను వెల్లడించిన ఇరిగేషన్ అధికారులు
Comments are closed.