*ప్రణాళికే ఆయన ఆయుధం…*
*పరిష్కారమే ఆయన సంకల్పం….*
*: ప్రతి ఇంటా సమస్యలను తెలుసుకునేందుకు ప్రత్యేకగ్రీవెన్స్ పుస్తకం ఏర్పాటు*
*: వినూత్న రీతిలో గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే మేకపాటి*
*: గడప గడపలో గుర్తించిన సమస్యలపై రూ.132.00 లక్షలతో అభివృద్ది పనులు*
*: వాలంటీర్లు గుర్తించిన 24 వేల సమస్యల్లో 10వేలకు పైగా పరిష్కారం*
*ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి వ్యవహార శైలి అందరూ రాజకీయ నాయకుల కంటే భిన్నంగా ఉంటుంది. ఆయన రాజకీయం చేసిన, అభివృద్ది పనులు చేపట్టిన, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించినా ప్రణాళికాబద్దంగా, సమయపాలన పాటిస్తూ ఖచ్చితంగా నిర్వహిస్తుంటారు.*

*గ్రామాల్లో నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మాత్రమే కాకుండా తన కార్యాలయంలో సైతం ప్రతి వినతిని, ప్రతి నాయకుడు తెలిపిన పనిని ప్రణాళికాబద్దంగా తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు మంత్రుల వద్ద నుంచి ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి ఆ సమస్యను పరిష్కరించడమే తన సంకల్పంగా మార్చుకుంటూ ముందుకు సాగుతున్నారు.*

*ఆత్మకూరు నియోజకవర్గంలో 93 సచివాలయాలు ఉండగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఇప్పటికే 66 సచివాలయాల పరిధిలో నిర్వహించారు. ఈ సచివాలయాల పరిధిలో 100కు పైగా పంచాయతీల్లో, 70 వేలకు పైగా గృహాలను సందర్శించి అక్కడి ప్రజలు తెలుపుతున్న సమస్యలను విని పరిష్కరించాలని అధికారులకు సూచిస్తున్నారు.*
*ఈ క్రమంలో ప్రజల సమస్యలు వారి గ్రామాలకు వెళ్లినప్పుడు మాత్రమే తెలుపుతున్నారని, మళ్లీ ఆ విషయమై అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విషయాన్ని గుర్తించిన ఎమ్మెల్యే మేకపాటి ఈ సమస్యకు ఓ మార్గాన్ని కనుగొన్నారు. వాలంటీర్లకు కేటాయించిన ఇళ్లకు కలిపి పూర్తి సమాచారం, సమస్యలను తెలుసుకునేందుకు ఓ ప్రణాళికను రూపొందించారు.*
*ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా ఈ సర్వేను పూర్తి చేసి వాలంటీర్ల వద్ద నుండి పుస్తకాలను సేకరించి శాఖల వారిగా వ్యక్తిగత, అభివృద్ది పనులు, సమస్యల జాబితాలను రూపొందించి అధికారులకు అందచేసి సమస్యల పరిష్కారంపై ప్రధానంగా దృష్టి సారించారు. వాలంటీర్ల ద్వారా గుర్తించిన 24 వేల పైచిలుకు సమస్యల్లో ఇప్పటికే 10 వేలకు పైగా సమస్యలను పరిష్కరించడం జరిగింది. మిగిలిన సమస్యల్లో అభివృద్ది పనులు, ఇతర వ్యక్తిగత సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తున్నారు. ఇలా సమస్యలను పూర్తిగా తెలుసుకుని ప్రతి సమస్యను అధికారుల, ప్రజాప్రతినిధులు, నాయకుల సహకారంతో పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు.*
*గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఇప్పటికే ఆత్మకూరు నియోజకవర్గంలోని 66 సచివాలయాల పరిధిలో రూ.132.00 లక్షల మేర అభివృద్ది పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రతి సచివాలయం పరిధిలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పర్యటన సందర్భంగా ప్రజలు తెలిపిన సమస్యలలో ప్రాధాన్యత క్రమంలో సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్లు, కల్వర్టుల నిర్మాణం, విద్యుదీకరణ తదితర ప్రధాన సమస్యల కోసం ఈ నిధులను వినియోగిస్తున్నారు.*
*మండలాల వారీగా మున్సిపల్ పరిధిలో రూ.1.20 కోట్లు, సంగం మండలానికి రూ.2.20 కోట్లు, మర్రిపాడు మండలానికి రూ.2.80 కోట్లు, ఏఎస్ పేటకు రూ.1.80 కోట్లు, ఆత్మకూరురూరల్ రూ.1.60 కోట్లు, చేజర్ల రూ.1.20 కోట్లు, అనంతసాగరం మండలానికి రూ.1.80 కోట్ల వంతున గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా అభివృద్ది నిధులను మంజూరు చేయించి ప్రధాన సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు.*
*రాష్ట్రంలో ఏ శాసనసభ్యుడు చేయని విధంగా ముఖ్యమంత్రి అందచేసిన సంక్షేమ పథకాలను అందించడమే కాకుండా, ప్రతి గడపలో సమస్యలను తెలుసుకుని వాటిని ప్రణాళికాబద్దంగా పూర్తి చేసేందుకు నడుం బిగించారు. అంతేకాక రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటికే వాలంటీర్లు, వీఆర్ఓలతో స్థానిక నాయకులను సమిష్టి భాగస్వాములను చేస్తూ రెవెన్యూ సమస్యలను జాబితాలను సైతం సిద్దం చేస్తున్నారు. మెట్ట ప్రాంత నియోజకవర్గమైన ఆత్మకూరులో ప్రతి సమస్యను తెలుసుకుని వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారంచూపడంలో ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి సఫలీకృతులవుతున్నారు.*

*సమస్యల పరిష్కారంలో, అభివృద్ది పనుల నిర్వహణలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి చేస్తున్న ప్రణాళికాబద్దమైన కృషికి ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు.*



Comments are closed.