The South9
The news is by your side.
after image

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన ‘నరసింహపురం’ ఫస్ట్ లుక్

post top

బహుముఖ ప్రతిభాశాలి శ్రీరాజ్ బళ్ళా దర్శకత్వంలో.. గీత్ గౌరవ్ సినిమాస్ పతాకంపై పి.ఆర్.క్రియేషన్స్ సమర్పణలో ‘శ్రీరాజ్ బళ్ళా-టి.ఫణికుమార్ గౌడ్- నందకిశోర్ ధూళిపాల’ సయుక్తంగా నిర్మిస్తున్న ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నరసింహపురం’. పలు సీరియల్స్, సినిమాల ద్వారా సుపరిచితుడైన నందకిశోర్ ఈ చిత్రం ద్వారా హీరోగా మారుతున్నారు. సిరి హనుమంతు హీరోయిన్ గా, ఉష చెల్లెలు పాత్రలో నటించారు. వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతూ… అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో అత్యద్భుతంగా తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ విజయదశమి పర్వదిన సందర్భంగా ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా విడుదలైంది.

Post Inner vinod found


తమ్మారెడ్డి మాట్లాడుతూ.. “మంచి మనసు, కష్టించే తత్వం కలిగిన నందు (నందకిశోర్) హీరోగా.. టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరాజ్ బళ్ళా రూపొందించిన ‘నరసింహపురం’ మంచి విజయం సాధించాలి. నేను పాటలతోపాటు… త్వరలో రిలీజ్ చేసే టీజర్, ట్రైలర్ చూశాను. చాలా అద్భుతంగా అనిపించింది” అన్నారు. హీరో నందకిశోర్ మాట్లాడుతూ.. “కథ మీద ప్రేమతో.. శ్రీరాజ్ పై నమ్మకంతో చేసిన ‘నరసింహపురం’ మా అందరికీ మంచి పేరు తీసుకువస్తుందనే నమ్మకం ఉంది” అన్నారు. దర్శకుడు శ్రీరాజ్ బళ్ళా మాట్లాడుతూ… “ఒక సంవత్సరం పాటు మా టీమ్ పడిన కష్టమిది. అందరి సహాయ సహకారాలతో ప్రేక్షకులు మెచ్చేలా ‘నరసింహపురం’ రూపుదిద్దుకుంది” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో
ఫణిరాజ్, కర్ణ ప్యారసాని పాల్గొన్నారు.
కల్యాణ మాధవి, లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫేమ్ విజయ్ కుమార్, అరవిందసమేత ఫేమ్ రంగధామ్, ‘రవివర్మ, సంపత్, ఫణిరాజ్, స్వామి’, ‘శ్రీకాంత్, శ్రీకర్’, శివ, జునైద్’, గిరిధర్, సాయిరాజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ అప్పాజీ, మేకప్: కె.వి.బాబు, పబ్లిసిటీ డిజైన్స్: వెంకట్.ఎం, విఎఫెక్స్: చందు ఆది, కెమెరా: కర్ణ ప్యారసాని, ఎడిటర్: శివ వై.ప్రసాద్, పాటలు: గడ్డం వీరు, సంగీతం: ఫ్రాంక్లిన్ సుకుమార్, నిర్మాతలు: శ్రీరాజ్ బళ్ళా- టి.ఫణికుమార్ గౌడ్-నందకిశోర్ ధూళిపాల, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీరాజ్ బళ్ళా!!

Post midle

Comments are closed.