The South9
The news is by your side.

ఏంట్రా రాజీనామా చేసేది యూజ్‌లెస్ ఫెలో.. రెచ్చిపోయిన వైసీపీ ఎంపీ

post top

కొంతమంది గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని మండిపడ్డారు రఘురామకృష్ణ రాజు. ఏమనుకుంటున్నావ్.. లేపేస్తాం.. అంతు చూస్తామని బెదిరిస్తున్నారన్నారు. నిన్న ఓ వైఎస్ రెడ్డి.. నిన్న రామిరెడ్డి అట.. రాజీనామా చేయి అంటూ ఏదేదో మాట్లాడుతున్నారు. ఇంటి దగ్గరకు వస్తే సీఆర్‌పీఎఫ్ వాళ్లు షూట్ చేసేస్తారు.. ఏంట్రా రాజీనామా చేసేది.. యూజ్ లెస్ ఫెలో అంటూ మండిపడ్డారు. తాను ప్రజామోదంతో నెగ్గానని.. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు. అమరావతి అక్కడే ఉంటుందంటూ అబద్దాలు ఆడారు.. గూబ పగిలిపోతుంది అంటూ విరుచుకుపడ్డారు.

after image

తన విజయంలో జగన్ 90 శాతం కారణమైతే.. తన బొమ్మతో కూడా తాను నెగ్గాను అన్నారు ఎంపీ. రాజీనామా చేయనని చెబుతున్నా.. వెధవల్లారా.. బెదిరించినవారు జాగ్రత్తగా ఉండండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. తన జోలికి రావొద్దని.. ఎశరి పరిధిలో వారు ఉంటే మంచిదన్నారు. ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. రోజూ వందల కాల్స్ వస్తాయి. రాజీనామా.. రాజీనామా అంటూ పనికిమాలిన మాటలు మాట్లాడు అన్నారు. తనలాగా ప్రభుత్వానికి సలహాలు ఇస్తే ఇవ్వాలని.. లేకపోతే ఏం మాట్లాడకుండా కూర్చోవాలన్నారు. అనవసరంగా తనను రెచ్చగొడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.