
మంత్రులతో కలిసి ఎంపీ ఆదాల ఏర్పాట్ల పరిశీలన

నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదివారం శ్రీ వేణుగోపాలస్వామి కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక ఏర్పాట్లను మంత్రులతో కలిసి పరిశీలించారు. అమ్మ ఒడి రెండో విడత ఆర్థిక సాయం విడుదల కార్యక్రమం నెల్లూరులోని శ్రీ వేణుగోపాలస్వామి కళాశాల మైదానంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సోమవారం ప్రారంభించ నున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి గాను భారీ వేదిక తో పాటు అన్ని ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈ ఏర్పాట్లను పరిశీలించెం
దుకుగాను మంత్రులు గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఆదిమూలపు సురేష్ లతో కలిసి నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి విచ్చేశారు. వారితో పాటు ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య , కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విజయ డైరీ ఛైర్మన్ రంగారెడ్డి, బట్టేపాటి నరేంద్ర రెడ్డి, మల్లు సుధాకర్ రెడ్డి, వై.వి రామిరెడ్డి ,నరసింహారావు తదితరులు హాజరయ్యారు. ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి జరుగుతున్న ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఈ ఏర్పాట్లపై మీడియా సమావేశం జరిగింది.
Comments are closed.