The South9
The news is by your side.

రేప్ కేసుల విచారణపై కేంద్రం కొత్త గైడ్ లైన్స్

post top

వెంటనే ఎఫ్.ఐ.ఆర్ – 60 రోజుల్లో దర్యాప్తు

– ఎఫ్ఐఆర్ నమోదు చేయని ఆఫీసర్లపై కఠిన చర్యలు

– బాధితుల మరణ వాంగ్మూలాన్ని సాక్ష్యంగా పరిగణించాలి

– నేరస్థులను ట్రాక్ చేసేందుకు నేషనల్ డేటా ఉపయోగించాలి

– ‘హత్రాస్ రేప్’ ఘటన నేపథ్యంలో కొత్త గైడ్ లైన్స్!

– రాష్ట్రాలు, యూటీలు తప్పకుండా పాటించాలని ఆదేశం

★ రేప్ కేసులకు సంబంధించిన దర్యాప్తును రెండు నెలల్లోగా పూర్తి చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Post midle

★ నేరం జరిగిన వెంటనే పోలీసులు ఎఫ్‌‌‌‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది.

★ సరైన సమయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయని ఆఫీసర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పింది.

★ మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి పోలీసులు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర హోం శాఖ శనివారం అడ్వైజరీ జారీ చేసింది.

★ రాష్ట్రాలు, యూటీలు ఈ రూల్స్ ను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.

★ ఈ రూల్స్ కు పోలీసులు కట్టుబడి ఉండాలని, లేదంటే బాధితులకు న్యాయం చేయలేమని చెప్పింది.

★ ఉత్తర్ ప్రదేశ్‌‌‌‌లోని హత్రాస్‌‌‌‌లో 19 ఏళ్ల దళిత బాలికపై అత్యాచారం, హత్య కేసులో పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారన్న వార్తల నేపథ్యంలో కేంద్రం మూడు పేజీలతో కూడిన అడ్వైజరీని తాజాగా జారీ చేసింది.

గైడ్ లైన్స్ ఇవీ..

after image

★ అత్యాచార ఘటనలతోపాటు నిందితుల్ని అరెస్టు చేసేంత తీవ్రత ఉన్న కేసుల విషయంలో పోలీసులు వెంటనే ఎఫ్‌‌‌‌ఐఆర్ నమోదు చేయాలి.

★ సంబంధిత పోలీస్ స్టేషన్‌‌‌‌ పరిధి బయట ఘటన జరిగితే జీరో ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌ రికార్డు చేయాలి.

★ ఇలా ఎఫ్‌‌‌‌ఐఆర్ నమోదు చేయడంలో ఫెయిల్ అయిన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలి.

★ సీఆర్‌‌‌‌పీసీలోని సెక్షన్ 173 ప్రకారం అత్యాచార కేసుల విచారణను రెండు నెలల్లో పూర్తిచేయాలి.

★ ఈ కేసుల విచారణను ట్రాక్ చేయడానికి కేంద్ర హోం శాఖ ఆన్‌‌‌‌లైన్ పోర్టల్‌‌‌‌ను తీసుకొచ్చింది.

★ రాష్ట్ర పోలీసుల దర్యాప్తు తీరును పర్యవేక్షించేందుకు ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఫర్ సెక్సువల్ అఫెన్సెస్ (ఐటీఎస్ఎస్ఓ) పేరుతో పోర్టల్ ను ఏర్పాటు చేసింది.

★ ప్రత్యేకంగా లా ఎన్ఫోర్స్ మెంట్ అధికారులకు ఇది అందుబాటులో ఉంటుంది.

★ లైంగిక దాడి/అత్యాచార కేసుల్లో బాధితులకు రిజిస్టర్డ్ డాక్టర్లతో పరీక్షలు నిర్వహించాలి.

★ పోలీసులకు సమాచారం అందిన 24 గంటల్లోగా టెస్టులు చేయించాలి.

★ ఒకవేళ బాధితులు చనిపోతే.. చనిపోవడానికి ముందు ఇచ్చిన వాంగ్మూలాన్ని సాక్ష్యంగా పరిగణించాలి.

★ కొన్ని సందర్భాల్లో మేజిస్ట్రేట్, పోలీసుల సమక్షంలో రికార్డు కాకుంటే.. ఆ కారణంతో బాధితులు ఇచ్చే మరణ వాంగ్మూలాన్ని విస్మరించకూడదు.

★ జ్యుడీషియల్ స్క్రూటినీ రిక్వైర్​మెంట్లకు అనుగుణంగా స్టేట్‌‌‌‌మెంట్ ఉన్నప్పుడు దాన్ని సాక్ష్యంగా పరిగణనలోకి
తీసుకోవాలి.

★ లైంగిక దాడుల విషయంలో ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించేందుకు కేంద్రం ఇచ్చిన సెక్సువల్ అస్సాల్ట్ ఎవిడెన్స్ కలెక్షన్(ఎస్‌‌‌‌ఏఈసీ) కిట్లను ఉపయోగించాలి.

★ లైంగిక దాడుల నేరస్థులను గుర్తించేందుకు, మళ్లీ నేరాలు చేయకుండా ట్రాక్ చేసేందుకు జాతీయ డేటా బేస్ ను రాష్ట్రాలు, యూటీలు ఉపయోగించాలి.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.