తెలుగు చలన చిత్ర పరిశ్రమలో టాప్ స్టార్స్ గా వెలుగొందుతున్న హీరోల్లో ఒక డు అల్లు అర్జున్. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరో గా ఉంటూనే తనకంటూ సపరేట్ బ్రాండ్ ను పెంచుకుంటూ ముందుకు వెళ్తున్న హీరో అల్లు అర్జున్. యూత్ ముద్దుగా స్టైలిష్ స్టార్ అని పిలుచుకునే అల్లు అర్జున్ కి యూత్ తో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉందనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఒక్కొక్క సినిమాతో తన ఇమేజ్ ను పెంచుకుంటూ, తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ టాలీవుడ్ లోనే కాక , మలయాళ చిత్ర పరిశ్రమలో కూడా ఎక్కువమంది అభిమానులను ఏర్పరుచుకున్నారు అల్లు అర్జున్. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురం లో. తన నటనతో, మాస్ హీరో ఇమేజ్ తో పాటు క్లాస్ ఆడియన్స్ కూడా చేరువయ్యారు. ఇక గతంలో అల్లు అర్జున్ తో ఆర్య సినిమా దర్శకత్వం వహించిన సుకుమార్ అల్లు అర్జున్ కి స్టైలిష్ స్టార్ అని నామకరణం చేశాడు. ఇప్పుడు అదే సుకుమార్ తన దర్శకత్వం లో పాన్ ఇండియా మూవీ గా వస్తున్న పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ ని ‘ఐకాన్ స్టార్’ అంటూ కొత్త బిరుదునిచ్చాడు . నిన్న జరిగిన పుష్ప సినిమా ఈవెంట్ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ గతంలో నన్ను స్టైలిష్ స్టార్ గా చేసిన సుకుమార్ , ఇప్పుడు మరలా ఐకాన్ స్టార్ అని పెట్టడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అభిమానులు అలరించే విధంగానే ముందుకు వెళ్తానని ఈ సినిమా అభిమానులను అలరించే విధంగా ఉంటుందని అల్లు అర్జున్ అన్నారు.




Comments are closed.