దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైయస్ షర్మిల రాజకీయ అరంగేట్రానికి ప్రధానమైన సభ నేడు ఖమ్మంలో మొదలుకానుంది. తెలంగాణలో
కొత్త రాజకీయ పార్టీ తో తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టనున్నారు వైయస్ షర్మిల. ఖమ్మంలో నిర్వహించే సభకి ‘సంకల్ప సభ’ అని నామకరణం చేశారు. షర్మిల అనుచర నేతలు , అభిమానులు భారీ స్థాయిలో సభకు వచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్లో లో శుక్రవారం సాయంత్రం సభ మొదలవుతుందని తెలిసింది. ఈ సభకి, షర్మిలతోపాటు వైఎస్ విజయమ్మ కూడా పాల్గొంటారని కార్యక్రమ నిర్వాహకులు సతీష్ రెడ్డి కొండా రెడ్డి తెలిపారు, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సభకు అనుమతి ఇవ్వడంతో ఆ దిశగా సభకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త పార్టీకి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఖమ్మంలో పెద్దతండ ప్రాంతానికి చేరుకోగానే వైయస్ షర్మిల ను విజయమ్మను స్వాగతం పలికి భారీ ర్యాలీతో ఖమ్మంలో కి తీసుకో వచ్చేటట్లు ఏర్పాట్లు చేశారని కార్యక్రమ నిర్వాహకులు కొండారెడ్డి తెలిపారు.
