The South9
The news is by your side.

ప్రముఖ ఛానల్లో రియాలిటీ షో హోస్ట్ గా ఎన్టీఆర్

post top

తాతకు తగ్గ మనవడుగా సినీ వినీలాకాశంలో దూసుకుపోతున్న యువ కెరటం యంగ్ టైగర్ ఎన్టీఆర్. తన నటనతో మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ,యూత్ ఆడియన్స్ ను, అందరినీ అలరిస్తున్న సకుటుంబ సపరివార హీరో నందమూరి తారక రామారావు అంటే అతిశయోక్తి కాదు. బాలనటుడిగా తెరంగేట్రం చేసిన జూనియర్ ఎన్టీఆర్ అంచెలంచెలుగా తన నటనా కౌసల్యంతో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ‌
‌ ‌ వెండితెర మీద ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో ఎవరూ చేయనటువంటి సాహసం చేశాడు ఎన్టీఆర్.
ఆ సాహసం పేరే బుల్లితెర వీక్షకులు ను అలరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. బిగ్ బాస్ కి హోస్ట్ గా ఎన్టీఆర్ చేస్తున్నాడు అనగానే అది ఒక సంచలనమే అయ్యింది. సినిమాలు నటించడం అనేది వేరు అక్కడ పలు టేకులు తీసుకునే సౌలభ్యం ఉంటుంది. కానీ బుల్లితెర విషయానికొస్తే ఇక్కడ ఆ పరిస్థితి ఉండదు. కంటెస్టెంట్ లు ఏ విధంగా స్పందిస్తారు తెలియదు ఆ సమయానికి తగ్గట్టు అప్పటికప్పుడు డైలాగులు హావభావాలు మార్చుకోవాల్సిన పరిస్థితి. అయితే ఈ చాలెంజ్ అని సునాయాసంగా చే దించాడు ఎన్టీఆర్. ‌‌తన అద్భుతమైన యాంకరింగ్ తో బిగ్ బాస్ షో ని సూపర్ డూపర్ హిట్ గా నిలిపాడు.. ఈ నేపథ్యంలో మరల బుల్లితెర వీక్షకులను అలరించడానికి ఎన్టీఆర్ ముందుకు రాబోతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . ‌‌ ‌‌ ‌
ఒక ప్రముఖ టీవీ ఛానల్ చేపట్టనున్న టువంటి రియాలిటీ షో కి ఎన్టీఆర్ ని హోస్ట్ గా సంప్రదించినట్టు దానికి ఎన్టీఆర్ అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. రాజమౌళి ఆర్. ఆర్. ఆర్ చిత్రం షూటింగ్ పూర్తికాగానే ఈ షోలో పాల్గొంటాడని ప్రచారం జరుగుతుంది. మొత్తానికి ఈ వార్త నిజమైతే బుల్లితెర వీక్షకులను రంజింపజేయడానికి మళ్ళీ ఎన్టీఆర్ ముందుకు వస్తున్నాడు అని అనుకోవచ్చు

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.