
మరి కొన్ని వారాల వ్యవధిలో దేశంలోని పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కు షెడ్యూల్ విడుదల చేయనుందట ఎన్నికల సంఘం.

త్వరలో పశ్చిమ బెంగాల్ తమిళనాడు అస్సాం కేరళ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన ఉన్న సంగతి తెలిసిందే
ఈ నేపథ్యంలో ఈ నెల 15 గాని 20 కానీ ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేయనున్నట్టు ఉందంట ఎన్నికల సంఘం. ఆంద్రప్రదేశ్ లోని తిరుపతి ఉప ఎన్నిక పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో ఉన్నారు. కొన్ని పార్టీ లవారు ఫలానావారు అభ్యర్థులను ముందుగానే ప్రకటన ద్వారా తెలియజేసి ఉన్నారు. పలు రాష్ట్రాల ఎన్నికలతో పాటే తిరుపతి ఉప ఎన్నిక కూడా నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తిరుపతి ఎన్నిక సంబంధించి రిటర్నింగ్ అధికారిని కూడా నియమించినట్లు తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో పంచాయితీ ఎన్నికల వేడి ముగియకముందే మరో రసవత్తర ఎన్నిక ఆంధ్రప్రదేశ్లో ఉందనుకోవాలి.
Comments are closed.