The South9
The news is by your side.

ఎమ్మెల్యే మేకపాటికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన అధికారులు, ప్రజాప్రతినిధులు.

post top

*అంబరాన్ని అంటిన సంబరాలు*

  • *: ఎమ్మెల్యే మేకపాటికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన అధికారులు, ప్రజాప్రతినిధులు*

*: ప్రతి ఇంటా ఇదే ఆనందం కొనసాగాలంటూ కోరుకున్న ఎమ్మెల్యే*

 

👉నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి బ్రహ్మణపల్లిలోని నివాసంలో, ఆత్మకూరులోని క్యాంపు కార్యాలయంలో సోమవారం సంబరాలు అంబరాన్ని అంటాయి.

 

after image

👉ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులతో పాటు ప్రతి మండలం నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు భారీగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నివాసానికి చేరుకుని ఆయన నూతనంగా సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాలతో సత్కరించి పూలబొకేలను అందచేశారు.

 

👉ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో కలసి నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేసి అందరికి తినిపించారు. ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరం సందర్భంగా ఆనందంగా ఉండాలంటూ వారికి శుభాకాంక్షలు తెలిపారు.

Post midle

👉ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని, ఈ నూతన సంవత్సరం ప్రతి ఒకరి ఇంటా ఇదే ఆనందంగా కొనసాగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.