The South9
The news is by your side.
after image

ఒక్క సారికమిట్అయితే చిత్రం ప్రారంభం

post top

వసుంధర క్రియేషన్స్ ,నటరాజ శ్రీనివాస క్రియేషన్స్ పతాకాలపై కళ్యాణ్ గల్లెల,మౌనికరాజ్ హీరోహీరోయిన్లుగా రవి ములకలపల్లి దర్శకత్వంలో పి.శ్రీనివాసరావు నిర్మిస్తున్న చిత్రం”ఒక్క సారికమిట్అయితే” ఇటీవల తెలుగు ఫిలింఛాంబర్లో లాంఛనంగా ప్రారంభమైది. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశాన్నికి ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్ క్లాప్ నివ్వగా లయన్ సాయి వెంకట్ కెమెరా స్విచ్ ఆన్ , ప్రముఖ దర్శకుడు ప్రేమ్ రాజ్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు.

అనంతరం విలేకరుల సమావేశంలో చిత్ర దర్శకుడు రవి ములకలపల్లి మాట్లాడుతూ… ఈ చిత్రాన్ని లవ్ అండ్ యాక్షన్ సెంటిమెంట్ ఎమోషనల్ మూవీగా యువతకు మంచి సందేశంతో పాటు ఇన్సిపిరేషన్ గా తెరకెక్కిస్తున్నాం , ఈ చిత్రంలో నాలుగు పాటలు ,నాలుగు ఫైట్లు ఉంటాయన్నారు. నిర్మాత పి.శ్రీనివాసరావు మాట్లాడుతూ… హైదరాబాద్ ,వైజాగ్ ,కోనసీమ ,కర్నూల్ పరిసర ప్రాంతాలలో మూడు షెడ్డ్యూలలో షూటింగ్ పూర్తిచేస్తామన్నారు .

Post Inner vinod found

హీరో కళ్యాణ్ మాట్లాడుతూ… ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతునందుకు సంతోషంగా ఉంది, ఈ అవకాశం కలిపించిన దర్శ నిర్మాతలకు కృతజ్ఞతలన్నారు. హీరోయిన్ మౌనికరాజ్ మాట్లాడుతూ… ఈ చిత్రం తరువాత నాకు ఆర్టిస్టుగా మంచి గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ఇంకా ఈ చిత్రంలో సుమన్ , జీవా,చిత్రం శీను , సుమన్ శెట్టి , తాగుబోతు రమేష్ , జబర్దస్త్ అంజి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన : దుర్గ కోమలి , కెమెరా : లోకనాథ్ రెడ్డి ,అశోక్, పాటలు సంగీతం : రవి ములకలపల్లి ,నిర్మాత : పి.శ్రీనివాసరావు , కథ స్క్రీన్ ప్లే , దర్శకత్వం : రవి ములకలపల్లి.

Post midle

Comments are closed.