పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ నిర్మించబోతున్న కొత్త చిత్రం “భవదీయుడు భగత్ సింగ్” పోస్టర్ ను ఈరోజు విడుదల చేసారు. వరుస చిత్రాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అయింది. గత కొన్ని రోజుల నుంచి హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది అనే వార్తలు వినిపించిన నేపద్యంలో 2 రోజుల క్రితం హరీష్ శంకర్ తో పాటు , మైత్రి మూవీస్ నిర్మాత పవన్ కళ్యాణ్ ని కలిసిన చిత్రాలు సోషల్ మీడియాలో రావడంతో ఖచ్చితంగా ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది అనే విషయంపై స్పష్టత వచ్చింది . వాటిని నిజం చేస్తూ ఈరోజు చిత్ర ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర బృందం. గతంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో మరల ఇదే కాంబినేషన్ రిపీట్ అవడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు టైటిల్” భవదీయుడు భగత్ సింగ్”అనేది ఆసక్తికరంగా మారింది

.



Comments are closed.