
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఫస్ట్ గ్లిమ్స్ ని విడుదల చేశారు. ఈ చిత్ర కథ చారిత్రాత్మక నేపథ్యంగా సాగే కథ అని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఇందులో పేద ప్రజల కోసం దోపిడి లు చేసే దొంగ గా పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈ రాబిన్ హుడ్ పాత్ర పవన్ కళ్యాణ్ అభిమానులను అలరించే విధంగా క్రిష్ రూపొందిస్తున్న ట్టుతెలుస్తోంది.గతంలో సూర్య మూవీస్ బ్యానర్ పై పవన్ కళ్యాణ్ బంగారు అనే చిత్రం లో నటించిన అది పెద్దగా విజయం సాధించలేకపోయింది. ఆతర్వాత పవన్ కళ్యాణ్ తన దర్సకత్వంలో సూర్య మూవీస్ మీద సత్యాగ్రహి అనే చిత్రాన్ని భారీ స్థాయిలో ప్రారంభించిన అది కూడా మధ్య లొనే ఆగిపోయింది. మరల తమిళ దర్శకుడు సూర్య దర్శకత్వంలో ఒక సినిమాని ప్రారంభించిన అదికూడా ఎందుకో పట్టాలెక్క లేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ,ఏ.యం.రత్నం కి ఇచ్చిన మాట కోసం ఈ సినిమా చేయడం జరిగిందని సినీవర్గాల సమాచారం.హరిహర వీర మల్లు అభిమానులు తో పాటు సినీ ప్రేక్షకులను ఆదరించాలని ఆశిద్దాం.

Comments are closed.