
1990 దశకంలో ఇళయరాజా ప్రభ అప్రతిహతంగా కొనసాగుతోన్న సమయం లో ‘రోజా’అనే చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమైన ఏ ఆర్ రెహమాన్ తాను స్వరపరిచిన గీతాలతో తమిళ చిత్ర పరిశ్రమకనే కాక యావత్ భారతదేశ సినీ పరిశ్రమ ను తన వైపు చూసేలా చేసాడు అంటే అతిశయోక్తి కాదు. అలా ప్రారంభమైన ఏ .ఆర్ రెహమాన్ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతున్న సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమ కన్ను ఎ. ఆర్. రెహమాన్ పై పడింది. ఈ నేపథ్యంలో ఏ. ఆర్ రెహమాన్ సూపర్ పోలీస్ అనే చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టారు. అయితే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చాలా విచిత్రమైన సెంటిమెంట్లు కొనసాగుతుంటాయి అలాంటి సెంటిమెంటే ఏ .ఆర్ రెహమాన్ నేరుగా స్వరపరిచిన గీతాలు విజయం సాధించినా చిత్రాలు ఏవి విజయం సాధించలేకపోయాయి అనేది ఒక అపవాదు, కాదు నిజం కూడా అనే వాదన ఉంది . ఒకసారి ఏ .ఆర్ రెహమాన్ స్వరపరిచిన చిత్రాలు గమనిస్తే వరుసగా … సూపర్ పోలీస్, పల్నాటి పౌరుషం, గ్యాంగ్ మాస్టర్, నీ మనసు నాకు తెలుసు, నాని కొమరం పులి, ఏ మాయ చేసావే, ఇలా ఏ చిత్రాలు ఆశించిన ఫలితాలు సాధించలేకపోయాయి. అలానే మరో సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ సంగీతం అందించిన తొలి డబ్బింగ్ చిత్రం చెలి తర్వాత, ఆయన చేసిన ఏ చిత్రాలు వరుసగా వాసు, ఆరెంజ్, స్పైడర్ , ఇలా అన్ని చిత్రాలు విజయం సాధించలేకపోయాయి. ఈ ఇద్దరు అగ్ర సంగీత దర్శకులు నేరుగా తెలుగు చిత్రాలు చేస్తున్నారంటే తెలుగు అభిమానులకు కు ఒక రకమైన ఆందోళన గురవుతున్నారు అనేది వాస్తవం. ఇప్పుడు రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం లో ఏ ఆర్ రెహమాన్ సంగీత దర్శకుడిగా చేస్తున్నారు అని రామ్ చరణ్ అభిమానులు ఒక రకమైన బ్యాడ్ సెంటిమెంట్ కొనసాగుతుంది ఏమో అని అనుకుంటున్నారు. అయితే గతంలో వీరు చేసిన బహుభాషా చిత్రాలు విజయం సాధించాయి. ఇప్పుడు రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కూడా బహుభాషా చిత్రమే కాబట్టి తెలుగు బ్యాడ్ సెంటిమెంట్ లేదు అనుకోవాల్సిందే…
Comments are closed.