The South9
The news is by your side.

హీరోయిన్ కంగ‌న‌కు చుర‌క‌లంటించిన ప్ర‌కాశ్ రాజ్

post top
  • ఒక్క సినిమాతో కంగ‌నా ల‌క్ష్మీభాయి అయిపోతుందా?
  • మ‌రి ప‌ద్మావ‌తిగా న‌టించిన దీపికా ప‌దుకుణె?
  •  అక్బ‌ర్ గా న‌టించిన హృతిక్ రోష‌న్?

వివాదాస్ప‌ద న‌టి కంగ‌నా ర‌నౌత్ ను కొంద‌రు రాణి లక్ష్మీభాయితో పోల్చుతూ ఆమె మ‌హారాష్ట్ర స‌ర్కారుపై ధైర్యం, శౌర్యంతో పోరాడుతోంద‌ని ఆకాశానికెత్తేస్తోన్న విష‌యం తెలిసిందే. రాణి లక్ష్మీభాయి శౌర్యాన్ని, త్యాగాలను తాను సినిమా ద్వారా చూపించానంటూ, నిజ‌జీవితంలోనూ త‌ల వంచ‌నంటూ ఇటీవ‌ల కంగ‌నా ర‌నౌత్ కూడా ట్వీట్ చేసింది.  దీనిపై సినీన‌టుడు ప్ర‌కాశ్ రాజ్ చుర‌క‌లంటించారు.

“ఒక్క సినిమాతో కంగ‌నా ర‌నౌత్ త‌న‌ను రాణి ల‌క్ష్మీబాయితో పోల్చుకుంటే మ‌రి ప‌ద్మావ‌తిగా న‌టించిన దీపికా ప‌దుకుణె, అక్బ‌ర్ గా న‌టించిన హృతిక్ రోష‌న్, అశోక‌గా న‌టించిన షారుక్, భ‌గ‌త్ సింగ్ గా న‌టించిన అజ‌య్, మంగ‌ళ్ పాండేగా న‌టించిన ఆమిర్ ఖాన్, మోదీగా న‌టించిన వివేక్ ను కూడా ఆ గొప్పవారితో పోల్చొచ్చు” అని ప్ర‌కాశ్ రాజ్ ట్వీట్ చేశారు.

after image

కాగా, ఇటీవ‌ల కంగనా ర‌నౌత్ శివ‌సేన నేత‌ల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం, ముంబైకి వెళ్ల‌డం, డ్ర‌గ్స్ కేసులో ఆమె పేరు విన‌ప‌డుతుండ‌డం వంటి ఘ‌ట‌న‌లు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైన విష‌యం తెలిసిందే. ఆమెకు బీజేపీ మ‌ద్ద‌తు ఉంద‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.