ఫిబ్రవరి 25న ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టండి..రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ) కన్వీనర్ పేరం నాగేశ్వర రావు గౌడ్

భూమిలేని ప్రతి రైతు కి భూమి ఉండాలనే సదుద్దేశంతో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ) అధ్యక్షులు, కేంద్ర సామాజిక న్యాయ సాధికారిత మంత్రి రాందాస్ అథవాలే పిలుపుమేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి 25 గురువారం రోజున ప్రతి జిల్లా నాయకులు ఆ జిల్లా కలెక్టర్ ని కలిసి నిరసన కార్యక్రమం చేపట్టాలని తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల కన్వీనర్ పేరం నాగేశ్వర గౌడ్ పిలుపునిచ్చారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ లో జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయసాధనకు కృషి చేయాలని అన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పని చేయాలని ఈ సందర్భంగా కార్యకర్తలను కోరారు పేరం నాగేశ్వరరావు గౌడ్ .
Comments are closed.