
సంచలనం అంటే రాంగోపాల్ వర్మ, రామ్ గోపాల్ వర్మ అంటే సంచలనం లాగా వుంటుంది ఆయన వ్యవహారం. ఆయన ట్విట్టర్ వేదికగా పలు అంశాలపై తన భావాల వ్యక్తి కరణ లో పలు వివాదాల కు తెర లేపుతుంటారు. ఈ నేపధ్యంలో గత కొంత కాలం గా ఆయన ఎదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తున్నారు. కరోనా సమయంలో అందరూ సినీ ప్రముఖులు ఇండ్ల కె పరుమితం అయితే వర్మ మాత్రం, కరోనా, పవర్ స్టార్, మర్డర్, అంటూ.. రకరకాల సినిమాలు తెసేరు. అవేమి వర్మ అభిమానుల ను అలరించలేదు.అయితే ఎన్ని ప్లాప్ లు తీసిన వర్మ నుంచి సినిమా అంటే అభిమానులు ఎదురు చూసే పరిస్థితి ఉంది అంటే ఇంకా వర్మ నుంచి ఎదో మంచి కంటెంట్ వస్తుంది ఏమో అని అభిమానులు ఆసిస్తూ ఉంటారు.
వర్మ గత చిత్రాలని పరిశీలిస్తే మంచి కధ దొరికితే 26/11 ఇండియాపై దాడి ,కిల్లింగ్ వీరప్పన్ లాంటి మంచి చిత్రాల్ని అందించాడు వర్మ. ఈ నేపథ్యంలో వర్మ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన నేపధ్యం మాత్రం అండర్ వరల్డ్ .గ్యాంగ్ స్టర్ ల నేపథ్యంలో వచ్చిన సత్య కంపెనీ సినిమాలు వర్మ కెరియర్ లొనే పెద్ద హిట్స్. ఇప్పుడు మరల అలాంటి నేపథ్యం తోనే డి కంపెని అనే పేరు తో దావుద్ ఇబ్రహీం బయోపిక్ అంటూ మొదలు పెట్టేడు.డి కంపెనీ సినిమాలో ఎంతో మంది గ్యాంగ్ స్టర్ ల చావు బతుకు లను చాలా దగ్గరగా చూపించనున్నాడు .ఈ చిత్రం ట్రైలర్ ని ఈ నెల 23 న విడుదల చేయనున్నారు. మొత్తానికి వర్మ నుంచి మరో మంచి సినిమా వస్తుంది అనిఆశిద్దాం.
Comments are closed.