The South9
The news is by your side.

తిరుపతి ఉప ఎన్నిక లో రత్నప్రభ నే బిజెపి అభ్యర్థి.

post top

తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ సీఎస్ రత్నప్రభ పేరును అధికారికంగా ఖరారు చేశారు. గత కొన్ని రోజుల క్రితం’ ద సౌత్ 9′ లో ‘బీజేపీ మదిలో కొత్త పేరు ‘ అనే శీర్షికతో రత్నప్రభ పేరుని ఖరారు చేస్తారని ముందుగానే వార్త ప్రచురించడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఆ పార్టీ అభ్యర్థిగా రత్న ప్రభ ను
లోక్‌సభ ఉప ఎన్నికకు బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిని కమల దళం ఖరారు చేసింది. అభ్యర్థిగా రత్నప్రభ పేరును ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ ప్రకటించారు. తమ పార్టీ ఎంపీ అభ్యర్థి రత్నప్రభ కు ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక ప్రభుత్వ సీఎస్‌గా పని చేసిన రత్నప్రభ ప్రజలకు ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఆమె అపార అనుభవం తిరుపతి అభివృద్ధికి ఎంతో ఉపయుక్తం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ సహకారంతో తిరుపతిని ప్రగతి పథంలోకి తీసుకెళ్లేందుకు తమ అభ్యర్థికే పట్టం కట్టాలని కోరారు. మరికొన్ని రోజులే నామినేషన్ గడువు ఉన్నందున ఎట్టకేలకు అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తరఫున పనబాక లక్ష్మి నామినేషన్ దాఖలు చేయగా, వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా గురుమూర్తి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ) మనపాటి చక్రవర్తి, సిపిఎం, తదితర అభ్యర్థులు పోటీలో ఉన్నారు

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.