The South9
The news is by your side.
after image

ఫ్లాప్‍ హీరోయిన్‍ బయోపిక్‍!

రియా చక్రవర్తి నటిగా ఫెయిల్యూర్‍. ఎప్పుడో చాలా కాలం క్రితం ఆమె తూనీగ తూనీగ అనే తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయమయింది. ఆ తర్వాత హిందీలో రెండు, మూడు సినిమాలలో నటించింది కానీ సక్సెస్‍ కాలేకపోయింది. సినిమాలు ఫెయిలైనా కానీ సక్సెస్‍ఫుల్‍ స్టార్‍ సుషాంత్‍ సింగ్‍ రాజ్‍పుట్‍ గాళ్‍ఫ్రెండ్‍గా మారింది. అదే ఆమె జీవితాన్ని మార్చేసింది. సుషాంత్‍ ఆత్మహత్య చేసుకోక ముందు వరకు కూడా రియా చక్రవర్తికి అతని గాళ్‍ఫ్రెండ్‍గా పెద్ద అటెన్షన్‍ లేదు. సాధారణంగా బాలీవుడ్‍ మీడియా అఫైర్లని బాగా కవర్‍ చేస్తూ వుంటుంది.

Post Inner vinod found

కానీ రియా చక్రవర్తి ఫ్లాప్‍ హీరోయిన్‍ కావడం వల్ల ఆమెకి గాసిప్‍ కాలమ్స్లో కూడా కవరేజీ వచ్చేది కాదు. అలాంటిది సుషాంత్‍ ఆత్మహత్య చేసుకున్నాక ఆమె నేషనల్‍ న్యూస్‍గా మారింది. ఇప్పుడు బాలీవుడ్‍ ప్రముఖ హీరోయిన్లను పట్టి పీడిస్తోన్న డ్రగ్స్ కేసుకి కారణం కూడా రియా చక్రవర్తినే. సక్సెస్‍ఫుల్‍ స్టార్‍ని వలలో వేసుకుని, అతనికి డ్రగ్స్ అలవాటు చేసి, మరణానికి కారణమయిందనేది చాలా మంది అభిప్రాయం. కానీ ఆమె పరిచయం కాకముందే అతనో డ్రగ్‍ అడిక్ట్ అని, డిప్రెషన్‍తో బాధ పడుతున్నాడని మరో వాదం.

ఏదేమైనా కానీ సాధారణ మధ్య తరగతి అమ్మాయి ఇండియా అంతా తన గురించి మాట్లాడుకునే సంచలనమయింది. బాలీవుడ్‍ ప్రముఖుల చీకటి నిజాలు బట్టబయలు కావడానికి కారణమయింది. రియా చక్రవర్తి గుడ్‍ ఆర్‍ బ్యాడ్‍ అటుంచితే… ఆమె కథ బాలీవుడ్‍ బ్లాక్‍బస్టర్‍కు మెటీరియల్‍ అవుతుందని భావించి ఇప్పుడామె జీవిత కథను తెరకెక్కించే ప్రయత్నాలు మొదలయ్యాయి. లాక్‍డౌన్‍కి ముందు వరకు ఫ్లాప్‍ హీరోయిన్‍ అయిన రియా… ఇరవై ఎనిమిదేళ్ల వయసులో తన బయోపిక్‍ రూపొందిస్తారని ఊహించనయినా ఊహించి వుంటుందా?

Post midle

Comments are closed.