The South9
The news is by your side.

గవర్నర్‌తో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ భేటీ

post top

గవర్నర్‌తో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ భేటీ
విజయవాడ‌: రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిగిన తీరును గవర్నర్‌కు ఆయన వివరించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయని ఎస్ఈసీ తెలిపారు.
నాలుగు దశల్లో జరిగిన ఎన్నికల వివరాలు, ఏకగ్రీవాలు తదితర విషయాలతో కూడిన నివేదికను ఎస్‌ఈసీకి గవర్నర్‌ నివేదించినట్లు సమాచారం. త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో వాటి నిర్వహణపైనా గవర్నర్‌కు వివరించినట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో నిర్వహించిన విధానాన్నే మున్సిపల్‌ ఎన్నికల్లోనూ అనుసరించాలని ఎస్‌ఈసీ భావిస్తోంది.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.