The South9
The news is by your side.

శాంత, కరుణ, వినయ, సహన, సుగుణ పరాక్రమ, విక్రమ.. ఆత్మకూరు నియోజకవర్గ భవిష్యత్ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్

post top

*శాంత, కరుణ, వినయ, సహన, సుగుణ పరాక్రమ ఆత్మకూరు నియోజకవర్గ భవిష్యత్ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్*

 

అజాతశత్రువు స్వర్గీయ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అనంతలోకాలకు చేరిన నేపథ్యంలో మేకపాటి విక్రమ్ ఆ స్థానంలో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ప్రతి పార్టీతో సఖ్యత, పరిచయమైన ప్రతి వ్యక్తితో ప్రశంస పొంది తన పనితనం, ప్రవర్తనతో యావత్ రాష్ట్రాన్ని ఆకర్షించిన ఐ.టీ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, వాణిజ్యం, చేనేత, జౌళి శాఖ మంత్రి మేకపాటి అకాల ఆకస్మిక మరణం తీరని విషాదం. ఆయన కుటుంబానికి అది మానని గాయం.

 

లక్షలాది మంది గుండెల్లో శాశ్వతంగా నిలిచేలా చివరి శ్వాస వరకు బతికిన మంత్రి మేకపాటి ఎవరు ఊహించని విధంగా దూరమవడం తలచుకుంటే తల్లడిల్లిపోయే సందర్భం. గుర్తుకొస్తే గుండె మెలి పెట్టే విషయం. అంతటి శోకంలోనూ తమను తాము సర్ది చెప్పుకుంటూ.. ప్రజలకు ధైర్యం నింపడం కోసం భిన్న సందర్భం, విభిన్న పరిస్థితుల నడుమనే దివంగత మంత్రి మేకపాటి కుటుంబం నుంచి తర్వాత ఎవరు? అనే ప్రశ్నకు సమాధానంగా తీసుకున్న నిర్ణయం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదం వెరసి మేకపాటి విక్రమ్ రాజకీయ అరంగేట్రం సాధారణంగా జరిగింది. ఓ వైపు తండ్రి వారసత్వం, మరో వైపు అన్న చూపిన అసాధారణ మార్గంలో ప్రయాణం మొదలు పెట్టారు. ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల వెలకట్టలేని ప్రేమాభిమానాలు, రాష్ట్రవ్యాప్తంగా మేకపాటి కుటుంబాన్ని ఆదరించే ప్రజల ఆశలు, ఆశయాలను సీఎం జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు.

 

కీర్తిశేషులు మేకపాటి గౌతమ్ రెడ్డి కన్నా సహనం, గౌతం బాబును మించి మంచితనం, గౌతమ్ రెడ్డికి రెండింతల శాంత గుణం విక్రమ్ బాబు లో ఉన్నాయి అంటూ పెద్దాయన మేకపాటి రాజమోహన్ రెడ్డి తన ప్రస్తుత రాజకీయ వారసుడు మేకపాటి విక్రమ్ రెడ్డి గురించి చెబుతున్నారంటే ఆత్మకూరుకు కాబోయే శాసనసభ్యులు విక్రమ్ రెడ్డి ఎందులోనూ తక్కువ కాదని చూపించే రోజులు దగ్గర్లోనే ఉన్నట్లు అనుకోవాల్సిందే. నమ్మాల్సిందే.

 

మేకపాటి రాజమోహన్ రెడ్డి ముగ్గురు కుమారులు చదివింది ఒకటే స్కూల్.. అదే ఊటీలో ఉన్న గుడ్ షెపర్డ్ పబ్లిక్ స్కూల్. ఆ తర్వాత విక్రమ్ రెడ్డి తన బీటెక్ గ్రాడ్యుయేషన్ చెన్నైలోని ఐఐటి కాలేజీలో సివిల్ విభాగంలో పూర్తి చేశారు. అప్పట్లో అలా చదివిన వాళ్లు దేశవ్యాప్తంగా నలుగురు ఉంటే అందులో ఒకరు విక్రమ్ రెడ్డి. అంటే ఎంతటి ఉన్నత చదువో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్న గౌతంలాగే ఆస్టిన్ లోని టెక్సాస్ యూనివర్సిటీలో విక్రమ్ రెడ్డి కూడా తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎం.ఎస్ ని స్పెషలైజ్డ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ విభాగంలో చదివారు. పరిశోధనాత్మక విద్యకు ఆ విశ్వవిద్యాలయం పెట్టింది పేరు. గౌతమ్ రెడ్డి రాజకీయ అరంగేట్రం నుంచి వాళ్ళ సొంత అంతర్జాతీయ నిర్మాణ సంస్థ కేఎంసీ బాధ్యతలను మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో మేకపాటి విక్రమ్ రెడ్డే నిర్వర్తించారు. మంత్రిగా తీరికలేని సమయం గడుపుతున్న అన్నకు వ్యాపార విషయాలు దరికి రాకుండా విజయవంతంగా తన కర్తవ్యాన్ని నిర్వహించారు.

 

తొలి అంతర్జాతీయ పర్యటనతో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలనే తపనతో మంత్రి గౌతమ్ రెడ్డి దుబాయ్ కి వెళ్లడానికి ముందు బెంగళూరులో విక్రమ్ రెడ్డి కట్టుకున్న ఇంటి గృహప్రవేశ వేడుకే మేకపాటి కుటుంబం మొత్తం కలిసి గడిపిన చివరి అందమైన సందర్భం. మరువలేని తీపి జ్ఞాపకం.

 

after image

మేకపాటి వంశంలోని లక్షణాలన్నీ సేమ్ టు సేమ్. శత్రువుకైనా హాని చేయరు. పగవాడ్ని కూడా బాధ పెట్టరు. కడుపునిండా కూడు పెట్టడమే తప్ప ఇంకొకరి పొట్ట మాత్రం కొట్టరు. మృదు స్వభావం, మనసు సున్నితం, మాటలు క్లుప్తం. మంచితనం సుస్పష్టం. మేకపాటి రక్తంలో నరనరాన ఇంకిన ఈ మంచి గుణమే వారి మంచి భవిష్యత్తుకి శ్రీరామరక్ష. సమయాన్ని పాటించడం, క్రమశిక్షణ, వినయ విధేయతలు విక్రమ్ రెడ్డికి అదనపు బలం.

 

Post midle

*మీరే జీవితం.. మీతోనే జీవితాంతమంటున్న మేకపాటి విక్రమ్ రెడ్డి*

 

సమయాన్ని పాటించడం, క్రమశిక్షణ, వినయ విధేయతలు విక్రమ్ రెడ్డికి అదనపు బలం. అన్న దూరమైన నాటి నుంచి నేటి వరకు విక్రమ్ రెడ్డి వాట్సాప్ డీపీ మారలేదు. మనసులో కన్నీటి పొరలు తొలగలేదు. కుటుంబాన్ని కమ్మేసిన శోకం ఇసుమంతైనా తగ్గలేదు. మరణించిన నాటి నుంచి మంత్రి గౌతమ్ రెడ్డి ధరించిన వస్త్రాలను ధరించి పదే పదే అన్నతో అనుబంధాన్ని గొంతు దిగని దుఃఖంలో తలుచుకుంటూ గడుపుతున్నారు. గౌతమ్ అన్న ఉంటే అయితే ఇలా అనేవాడు అలా చేసేవాడు అదుగదుగో అచ్చు ఈ విధంగా ఉండేవాడు అనుకున్న సందర్భాలు, తెలుసుకున్న విషయాలు అనేకం. గౌతం రెడ్డి కుమార్తె కుమారి సాయి అనన్య తండ్రి స్వర్గీయ మంత్రి గౌతమ్ రెడ్డి సంస్మరణ సభ హైదరాబాద్ వేదికగా జరిగినప్పుడు ఆమె వాళ్ళ నాన్నని తలుచుకుంటూ.. గుర్తు చేసుకుంటూ చేసిన ఉపన్యాసం మేకపాటి కుటుంబ లోటుకు సజీవ సాక్ష్యం.

 

ప్రజా జీవితంలో ఎక్కువ సేపు ఏ విషాదంపైనా ఏడవలేం. అలాగని మర్చిపోనూలేం. అందుకే అన్ని పక్కనపెట్టి తప్పని పరిస్థితుల్లో అన్న ఆశయాలను నెరవేర్చడానికి ఆత్మకూరు ప్రజల తమ్ముడిగా వస్తున్నాడు. అన్న చేయాలనుకున్నవన్నీ పూర్తి చేయడానికి అడుగు ముందుకు వేశాడు. వైఎస్ కుటుంబంతో మేకపాటి కుటుంబానికి గల అనుబంధమే పునాదిగా ఆత్మకూరు నియోజకవర్గాన్ని అందంగా నిర్మించడానికి వస్తున్నాడు. మేకపాటి కుటుంబంతో రాష్ట్ర ప్రజలకు ఉన్న అవినాభావ సంబంధాన్ని కొనసాగించడానికి వారధిగా మారబోతున్నాడు. రామాయణంలో రాముడి కష్టాన్ని మాత్రమే పంచుకున్న లక్ష్మణుడై ఈ కష్టకాలంలో వస్తున్నాడు. మేకపాటి వారసుడొస్తున్నాడు. మేకపాటి గౌతమ్ రెడ్డి తమ్ముడు వచ్చేస్తున్నాడు. ఆత్మకూరు ప్రజల ఆశాజ్యోతిగా వెలిగేందుకు వచ్చేస్తుడొచ్చేస్తున్నాడు.

 

ప్రజల అభిమానమే ఆయుధం. మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ఇచ్చిన కీర్తిప్రతిష్టలే అస్త్రం. మేకపాటి వంశ వ్యక్తిత్వమే బలం, బంధుగణం.

 

ఏ సంబంధం లేకున్నా మా అన్న చనిపోయినప్పుడు మేకపాటి కుటుంబం కోసం కార్చిన ప్రతి కన్నీటిని తుడుస్తానంటూ. ఎటువంటి బంధం లేకపోయినా బాధపడిన ప్రతి గుండెను ఓదారుస్తానంటూ. అన్న వెంటే నడిచి, అన్నకు అనువనువున అండగా నిలబడిన ప్రతి ఒక్కరితో మమేకమవుతానంటూ.. నాన్న ఆశ , ప్రజల నమ్మకం, అన్న ఆశయాన్ని సీఎం జగన్ గారి అండతో నిలబెడతానంటూ.. మీ క్షేమం కోసం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానంటూ.. మేమే లోకంగా బతికిన మీరే నా అసలైన ప్రపంచంగా భావించి మీతో కలిసి ముందుకు సాగుతానంటున్నారు. మీ అడుగులో అడుగునవుతానంటూ.. మీ ఆశలకు శ్వాసనవుతానంటూ.. మా కోసం నిలబడిన మీ అందరి కోసం కలబడతా.. నిలబడతా.. మిమ్మల్నీ నిలబెడతానంటూ మేకపాటి విక్రమ్ రెడ్డి మీ చెంతకు వచ్చేశాడు ?

 

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.