The South9
The news is by your side.

సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ ట్రైల‌ర్ విడుద‌ల‌

సుబ్బు దర్శకత్వంలో హీరో సాయి  తేజ్, నభా నటేష్ జంటగా నటించిన సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’ ట్రైలర్ విడుదలైంది. సాయితేజ్ కటౌట్‌ను కొందరు తగుల బెట్టడంతో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ప్రేమ, పెళ్లి అనే విషయాలకు వ్యతిరేకంగా సాయితేజ్ స్పీచ్ ఇస్తుండడం ఇందులో చూడొచ్చు. శ్రీ వెంక‌టేశ్వర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Post Inner vinod found

ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన  వచ్చింది. ఈ సినిమాను డిసెంబ‌రు‌ 25న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ మెగా హీరో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.  జీ స్టూడియోస్ సంస్థ థియేట్రికల్ రిలీజ్ హక్కులను కొనుగోలు చేసి విడుదల చేస్తోంది.

Post midle

Leave A Reply

Your email address will not be published.