The South9
The news is by your side.
after image

రైతు రిక్షా ఎక్కిన సోనూసూద్!

post top

సినిమాలో విలన్ గా కనిపించే సోను సూద్ నేడు దేశం మొత్తం మీద సూపర్ హీరోగా కొనియాడుతున్నారు. కరోనా మొదటి వేవ్ నుంచి ఎంతోమందికి సాయం చేసిన వ్యక్తిగా నిలిచాడు సోనూసూద్. దేశంలో చాలామంది వలస కార్మికులు తమ ప్రాంతాలకు సురక్షితంగా వెళ్ళడానికి కావలసిన రవాణా సౌకర్యం చేకూర్చడం తో మొదలైన సోనుసూద్ సహాయాలు పరంపర కొనసాగుతూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ లో చాలామంది కి ఆక్సిజన్ సిలిండర్లు సమకూర్చడం జరిగింది. ఒక ప్రాంతం అని కాకుండా ఎక్కడ సహాయం కావాలి అని తనకు వారు నేరుగా సోషల్ మీడియా ద్వారా సోనూసూద్ ని సంప్రదిస్తే వెంటనే వారికి సహాయం చేకూర్చే విధంగా ఒక నెట్వర్క్ ని ఏర్పాటు చేశారు సోనూసూద్. అందుకే ఇప్పుడు ఆయన సూపర్ హీరోలా మారారు. ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో ని ఆత్మకూరు నియోజకవర్గంలో ఆక్సిజన్ ప్లాంట్ ని ఏర్పాటు చేసి తన పెద్ద మనసు చాటుకున్నారు సోను సూద్. తాజాగా ఈరోజు ఒక వీడియో ఆల్బమ్ చిత్రీకరణ నేపద్యంలో పంజాబ్ కి వెళ్లిన సోనూసూద్ ఒక రైతు రిక్షా తొక్కతూ అతనితో పాలు బేరమాడినట్లు, మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోని సోనూసూద్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Post Inner vinod found

Post midle

Comments are closed.