The South9
The news is by your side.

శశికళకు సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోన్ కాల్

after image

తమిళ్ సూపర్ స్టార్ రజిని శశికళ తో ఫోన్ లో ఆరోగ్యం పై ఆరా

Post Inner vinod found

రాజకీయాల గురించి కూడా చర్చించినట్లు సమాచారం

చెన్నై ప్రతినిధి:                                                                          తమిళనాడులొ     రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. నిన్న శశికళ ఎంట్రీ తోనే రాజకీయ హంగామా మొదలైందని చెప్పాలి. శశికళ నిన్న తలపెట్టిన భారీ ర్యాలీకి పోలీసులు అడుగడుగున ఆటంకాలు పెట్టడం, ఐదు వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వడం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో చెన్నై చేరుకోవడానికి నిన్న సాయంత్రం అయ్యింది . చెన్నై చేరుకోగానే ఎంజీఆర్ కి నివాళులర్పించి జయ లలిత తర్వాత నేనే నిజమైన వారసులని తెలియజేసింది శశికళ. ఈ నేపథ్యంలో లో రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించిన తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ శశికళ కి ఫోన్ చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఈరోజు రజినీకాంత్ శశికళ కి ఫోన్ చేసి తన ఆరోగ్యం గురించి అడిగినట్టు తెలుస్తోంది. ఆరోగ్యం గురిం చే కాకుండా రాజకీయాల గురించి ఏమైనా సంభాషించాడు అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి రజిని ఫోన్ సంభాషణ తో తమిళనాడు రాజకీయాలు ఏ విధంగా మలుపు తిరగనున్నవో వేచి చూడాల్సిందే ‌‌

Post midle

Comments are closed.