
The South 9 | Exclusive Report
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు లో ఆశ్చర్యకరమైన నిజాలు?
రాజకీయ నేతలు, మీడియా ప్రతినిధులపై అనధికార గూఢచర్యం?
📍 హైదరాబాద్ | జూన్ 17, 2025
తెలంగాణ రాజకీయాలలో మరోసారి ఉలిక్కిపడే పరిణామం. గత ప్రభుత్వ హయాంలో విస్తృతంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తాజా విచారణలో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ టి. ప్రభాకర్ రావు నేతృత్వంలో ఏర్పాటైన స్పెషల్ ఆపరేషన్స్ టీం (SOT) అనేక మంది ఫోన్ సంభాషణలను చట్ట విరుద్ధంగా పర్యవేక్షించినట్లు స్పష్టమైంది
📌 ఎవరు టార్గెట్ అయ్యారు?
విశ్వసనీయ సమాచారం ప్రకారం, ట్యాపింగ్ లక్ష్యంగా మారిన వారిలో:

కాంగ్రెస్, బీజేపీ నేతలు
ప్రముఖ వ్యాపారవేత్తలు

ఎడిటర్లతో సహా ప్రధాన మీడియా ప్రతినిధులు
కొందరు న్యాయమూర్తులు కూడా
అనుమానితుల ప్రణాళిక ప్రకారం, వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసమే ట్యాపింగ్ జరిగిందని SIT అధికారులు గుర్తించారు.
🧾 ఆధారాలను మాయం చేసిన కుట్ర?
ఈ ఆపరేషన్‌కు సంబంధించిన కీలక సమాచారం ఉన్న హార్డ్‌డిస్కులను ముసి నదిలో పడేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఇప్పటికీ కొన్ని ఆధారాలను సేకరిస్తూ విచారణను వేగవంతం చేస్తోంది.
🌐 విదేశీ ఆశ్రయం – అమెరికా నుంచి తిరస్కారం:
ప్రధాన నిందితుడు టి. ప్రభాకర్ రావు అమెరికాకు పారిపోయినట్లు తెలుస్తోంది. అక్కడి ప్రభుత్వం అతనికి రాజకీయ ఆశ్రయం (asylum) ఇవ్వడానికి నిరాకరించింది. ప్రస్తుతం అతని తిరిగి వచ్చాక విచారణ కి హాజరుయ్యారు.
🗣️ రాజకీయ ప్రకంపనలు
బీజేపీ నేత కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “ఈ చట్ట విరుద్ధ ట్యాపింగ్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే,” అని అన్నారు.
TPCC అధ్యక్షుడు బి. మహేష్ గౌడ్ ఆరోపించారు: “నా ఫోన్ కూడా ట్యాపయ్యింది. ఇది రాజకీయ కక్షల పరాకాష్ఠ.”
Comments are closed.