The South9
The news is by your side.
after image

తేజు పెళ్లి.. నిజమా స్టంటా?

‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటూ ‘మనీ’ సినిమాలోని ఓ పాటలోని పంక్తినే టైటిల్‌గా పెట్టుకుని సినిమా చేశాడు మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్. ఈ పేరు చూస్తేనే సినిమా కాన్సెప్ట్ ఏంటన్నది అర్థమైపోయింది. పెళ్లి వద్దు సింగిల్ లైఫే ముద్దు అంటూ ఈ సినిమా నుంచి వచ్చిన ప్రోమోలు అందరినీ ఆకట్టుకున్నాయి. ‘నో పెళ్లి’ అనే పాట కూడా బాగా పాపులర్ అయింది. ఇప్పుడు తేజు ఓ ఆసక్తికర అప్ డేట్‌తో ట్విట్టర్ ఫాలోవర్లను పలకరించాడు. అది సినిమా ప్రమోషన్ కోసం చేసిందా.. అతడి నిజ జీవితానికి సంబంధించిందా అన్న విషయమే అర్థం కావట్లేదు.

Post Inner vinod found

తేజు ఆదివారం ఉదయం ఒక ఆసక్తికర వీడియోను పంచుకున్నాడు. ‘సింగిల్ ఆర్మీ’ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్‌లో తేజుతో పాటు ప్రభాస్, రానా, నితిన్, నిఖిల్, వరుణ్ తదితరులు ఉండగా.. అందులో పెళ్లి ఖాయమవ్వగానే నిఖిల్, నితిన్, రానా.. ఒకరి తర్వాత ఒకరు గ్రూప్ నుంచి వెళ్లిపోయినట్లు చూపించి.. చివరగా ‘ఇట్స్ మై షో టైమ్ సారీ ప్రభాస్ అన్నా’ అని తేజు కూడా ఎగ్జిట్ అయినట్లు ఈ వీడియోను ముగించారు. బ్యాగ్రౌండ్లో పెళ్లి మ్యూజిక్ వినిపించారు. పూర్తి వివరాలకు సోమవారం ఉదయం వరకు ఎదురు చూడమని చెప్పాడు తేజు.

ఈ వీడియో చూడగానే తేజు కూడా పెళ్లి కొడుకు అయిపోతున్నాడా.. అతడి పెళ్లి ఖాయమైందా అన్న సందేహాలు కలిగాయి అభిమానులకు. ఐతే సినిమాలో హీరో లైఫ్ యు టర్న్ తీసుకుని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితుల్లో వచ్చే పాటను రేపు లాంచ్ చేయబోతున్నారని.. అందుకే ఈ హంగామా అంతా అని అంటున్నారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ సైతం దీని గురించి ట్విట్టర్లో అప్ డేట్ ఇచ్చిన నేపథ్యంలో ఇది కచ్చితంగా ‘పబ్లిసిటీ స్టంట్’యే అన్నది స్పష్టమవుతోంది. సుబ్బు అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా.. తమన్ సంగీతాన్ని సమకూర్చాడు.

Post midle

Comments are closed.