The South9
The news is by your side.

రేపే అనంతలో మచ్చా రామలింగారెడ్డి 48 గంటల నిరసన దీక్ష

post top
  • మీడియా స్వేచ్ఛ కోసం దీక్ష
  • రాష్ట్రంలోని జర్నలిస్టులు అందరూ నిరసనలో పాల్గొనండి
  • కరోనా వల్ల మీ ప్రాంతాల్లో మీ ఇళ్లల్లో కూర్చొని జర్నలిస్టులు హైకోర్టు తీర్పుపై ఫ్లకార్డ్స్ పట్టుకొని నిరసన వ్యక్తం చేయాలి
  • అనంత ప్రెస్ క్లబ్ లో నిరసన గోడపత్రిక ఆవిష్కరణ
  • యూనియన్లకు అతీతంగా ఉద్యమంలో పాల్గొనండి: మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఏపీ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ (APJDS) పిలుపు

?అమరావతి భూ కుంభకోణంలో ఏసీబీ F.I.R నమోదు చేయడాన్ని వార్తలు రాయకూడదని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీడియా స్వేచ్ఛను హరించడమే మీడియాకు సంకెళ్లు లాంటిదే అని మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఏపీ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ అన్నారు.

?ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు పునఃసమీక్షించాలని మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ రేపు 22వ తారీకు ఉదయం 10 గంటలకు అనంతపురం నగరంలోని పాత RDO కార్యాలయం ఎదురుగా, టవర్ క్లాక్ దగ్గర ఏపీ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో 48 గంటల నిరసన దీక్ష చేస్తున్నామని రామలింగారెడ్డి వెల్లడించారు.

?అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఈరోజు ఉదయం జర్నలిస్టుల 48 గంటల నిరసన దీక్ష గోడపత్రికలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ నగర అధ్యక్షులు శ్రావణ్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు ఉధండం చంద్రశేఖర్, బాలు, సాకే జానీ ఎస్కేయు ఆనంద్, నాయక్ కుల్లాయిస్వామి, శ్రీకాంత్ నాగేంద్ర, నారాయణస్వామి శివ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

after image

Tomorrow Machcha Ramalingareddy 48 hours in infinity Initiation of protest

?48 గంటల జర్నలిస్టులు నిరసన దీక్షలో ప్రతి ఒక జర్నలిస్టు యూనియన్లకు అతీతంగా పాల్గొనాలని మన సత్తా ఏపీ హైకోర్టు దిగి వచ్చేంత వరకు తీర్పు ఉత్తర్వులు రద్దు చేసేంతవరకు జర్నలిస్ట్ మీడియా సోదరులు ఐకమత్యంగా పోరాటం చేసి విజయం సాధించాలని మచ్చా రామలింగారెడ్డి అన్నారు.

?కరోనా వల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి జర్నలిస్టులు హైకోర్టు ఇచ్చిన తీర్పును మీడియా స్వేచ్ఛ నిరసిస్తూ 48 గంటల్లో మీ ప్రాంతాల్లో నిరసన వ్యక్తం చేయాలని ప్లే కార్డ్స్ ప్రదర్శించాలని ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు, ఈ తీర్పును వ్యతిరేకించాలని అందరూ 48గంటల దీక్షలో పాల్గొనాలని రెడ్డి విజ్ఞప్తి చేశారు..

Post midle

?రేపు జరిగే మీడియా స్వేచ్ఛ ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం జరిగే జర్నలిస్టుల 48 గంటల నిరసన దీక్షను ప్రతి జర్నలిస్టు పాల్గొని విజయవంతం చేయాలని ఏపీ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ కోరింది.

?ANDHRAPRADESH JOURNALIST DEVELOPMENT SOCIETY, ANANTAPURAMU DIST?

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.