The South9
The news is by your side.

అమెరికా అధ్యక్షుని ఎన్నికల్లో ట్రాన్స్ జెండర్

post top

south9 ప్రతినిధి

after image

అమెరికా అధ్యక్షుని ఎన్నికల్లో  ట్రాన్స్ జెండర్ చరిత్ర సృష్టించారు తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు తొలిసారి అధికారికంగా సెనెట్ లోకి అడుగుపెట్టనున్న ట్రాన్స్జెండర్ గా రికార్డులకి ఎక్కారు డెమొక్రటిక్ పార్టీ తరపున డెలావ‌ర్‌ నుంచి సెనెట్‌కి పోటీ చేసిన సారా మైక్ బ్రైడ్ ఈ ఘనత‌ను సాధించారు. ఓటర్లు ఆమెకు పట్టం కట్టారు మంగళవారం పోలింగ్ ముగిశాక చేపట్టిన ఓట్ల లెక్కింపులో ఆది నుంచి ఆమె ఆధిక్యం క‌న‌బ‌రిచారు మూడింట రెండొంతుల ఓటర్లు ఆమెకే ఓటేశారు పునరుత్పత్తి విషయంలో స్వేచ్ఛను పర్యవేక్షించేందుకు అమెరికా కట్టుబడి ఉంటుందనే విషయాన్ని డెలావ‌ర్ ఓట‌ర్లు గట్టిగా చాటి చెప్పారుగా మనకందరికీ కావలసిన ప్రజాస్వామ్యం ఇదే అని సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేశారు చైల్డ్ కేర్ ఖ‌ర్చులు అంద‌రికీ అందుబాటులో ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటాను. ఉద్యోగ‌స్తుల‌కు పెయిడ్ ఫ్యామిలీ, మెడిక‌ల్ లీవ్‌లు సౌక‌ర్యం క‌ల్పిస్తాను. హౌసింగ్‌, హెల్త్‌కేర్ విష‌యంలో మెరుగైన వ‌స‌తులు క‌ల్పిస్తాన‌న్నారు. ట్రాన్స్ జెండర్ల హక్కుల ప‌రిర‌క్ష‌ణ‌కు పాటు ప‌డ‌తాన‌ని, స‌భ‌లో వారి త‌ర‌పున గ‌ళం వినిపిస్తాన‌ని ఈమె తెలిపారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.