The South9
The news is by your side.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటుతాం.. 75 సీట్లు గెలుస్తాం: డీకే అరుణ

post top

ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఫాంహౌస్ కే పరిమితం చేయాలని తెలంగాణ ప్రజలు డిసైడయ్యారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఇంటి పక్కన ఉన్న దుబ్బాక ప్రజలే కేసీఆర్ ను నమ్మలేదని… వేరే ప్రాంతాల్లోని ప్రజలు నమ్మే ప్రసక్తే లేదని చెప్పారు. రంగారెడ్డి జిల్లా మైలార్ దేవరపల్లి టీఆర్ఎస్ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి భారీ సంఖ్యలో తన అనుచరులతో కలిసి ఈరోజు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

after image

జీహెచ్ఎంసీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అరుణ చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో 75 స్థానాలను గెలుస్తామని తెలిపారు. టీఆర్ఎస్ కు, ఆ పార్టీ నేతలకు బుద్ధి చెప్పేందుకు నగర ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. హైదరాబాద్ నగర అభివృద్ధిపై టీఆర్ఎస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పిందని విమర్శించారు.

అన్నీ కేంద్ర ప్రభుత్వమే ఇస్తే… తెలంగాణ ప్రభుత్వం చేసేదేముందని ప్రశ్నించారు. వరద బాధితులను ముఖ్యమంత్రి పరామర్శించకపోవడం దారుణమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ దోచుకుంటున్నారని మండిపడ్డారు. నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.