The South9
The news is by your side.

క్యాబినెట్ సమావేశం ఎందుకు వాయిదా పడుతోంది ?

post top

ఈనెల 8వ తేదీన జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మళ్ళీ వాయిదాపడింది. ప్రతి నెలలో రెండుసార్లు మంత్రివర్గ సమావేశాలు జరగాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ నిర్ణయానికి తగ్గట్లుగానే గడచిన 16 మాసాలుగా క్యాబినెట్ మీటింగ్ లు జరుగుతున్న విషయం అందరు చూస్తున్నదే. కానీ సెప్టెంబర్ లో జరగాల్సిన రెండో సమావేశం మాత్రం ఇప్పటికి వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. పోయిన నెలలో రెండో క్యాబినెట్ మీటింగ్ 25వ తేదీన జరగాల్సుంది. అయితే అనివార్య కారణాల వల్ల అక్టోబర్ 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.

after image

సరే అక్టోబర్ 1వ తేదీన సమావేశం జరుగుతుంది కదా అని అనుకుంటే చివరి నిముషంలో దాన్ని కూడా వాయిదే వేశారు. సెప్టెంబర్ 30వ తేదీన ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. అయితే అక్టోబర్ 8వ తేదీకి క్యాబినెట్ సమావేశం వాయిదా వేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించాయి. అయితే తాజాగా అక్టోబర్ 8వ తేదీన జరగాల్సిన సమావేశం కూడా వాయిదా పడినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. జగన్ ఢిల్లీ పర్యటన కారణంగా క్యాబినెట్ సమావేశం వాయిదా పడిందని కూడా అనుకునేందుకు లేదు. ఎందుకంటే ఈరోజు అంటే మంగళవారం ప్రధానమంత్రితో భేటి తర్వాత జగన్ తిరిగి రాత్రికల్లా అమరావతికి తిరిగొచ్చేస్తారు.

ముఖ్యమంత్రి అధికారిక షెడ్యూల్ ప్రకారమే 8వ తేదీన క్యాబినెట్ సమావేశం జరపటానికి ఎటువంటి ఇబ్బందీ లేదు. అయినా సమావేశాన్ని వాయిదా వేయటం గమనార్హం. ఇప్పటికే మూడుసార్లు వాయిదాపడిన క్యాబినెట్ సమావేశం మళ్ళీ ఎప్పుడు జరుగుతుందో మాత్రం ప్రకటించలేదు. నిజానికి నెలలో రెండుసార్లు క్యాబినెట్ సమావేశం జరిపాల్సిన అవసరమైతే లేదనే చెప్పాలి. నెలలో ఒకసారి క్యాబినెట్ సమావేశం జరిపితే అందుకు అవసరమైన సబ్జెక్టులు ఉంటాయి. అదే ప్రతి 15 రోజులకు ఓ సమావేశం అంటే చర్చించేందుకు అసలు సబ్జెక్టులే ఉండవు. పైగా మంత్రులకు కూడా బొత్తిగా ఆసక్తి తగ్గిపోతుంది. ఇందుకనే గతంలో ముఖ్యమంత్రులుగా ఎవరున్నా నెలకు ఒకసారి మాత్రమే క్యాబినెట్ సమావేశం నిర్వహించేవారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.