The South9
The news is by your side.

ఫైర్ బ్రాండ్ ‘సంధ్య’ విడుదల చేసిన రాంగ్ గోపాల్ వర్మ పోస్టర్

after image

జర్నలిస్ట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రాంగ్ గోపాల్ వర్మ’. స్టార్ కమెడియన్ షకలక శంకర్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం టైటిల్ లోగోను ప్రముఖ మహిళాభ్యుదయవాది దేవి ఆవిష్కరించగా… ఈ చిత్రం పోస్టర్ ను మరో మహిళాభ్యుదయవాది సంధ్య ఈరోజు రిలీజ్ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మహిళల పట్ల చాలా చిన్న చూపు కలిగిన ఓ దర్శకుడి చేష్టలు ఎండగడుతూ సీనియర్ జర్నలిస్ట్ ప్రభు రూపొందిస్తున్న ‘రాంగ్ గోపాల్ వర్మ’ చిత్రాన్ని నేను స్వాగతిస్తున్నాను.

Post Inner vinod found

డబ్బుల కోసం వ్యక్తిత్వహననాలకు పాల్పడే వ్యక్తుల్ని ఎంతమాత్రం ఉపేక్షించకూడదు” అన్నారు. ఓ ప్రముఖ దర్శకుడి విపరీత చేష్టలతో విసిగిపోయి తాను ఈ చిత్రాన్ని తెరకెక్కస్తున్నానని… షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోందని, ఈ చిత్రం కోసం తాను రాసిన ‘వర్మా వర్మా వర్మా… ఓ రాంగ్ గోపాల్ వర్మ… ఇలా కాలింది ఏమిటయ్యా మా ఖర్మ’ అనే పాట ఓ ప్రముఖ ఆడియో కంపెనీ ద్వారా త్వరలో రిలీజ్ కానుందని రచయిత-దర్శకనిర్మాత ప్రభు తెలిపారు!!.

Post midle

Comments are closed.