The South9
The news is by your side.

యూత్ ప్రేమ కథ చిత్రం నాలో నిన్ను దాచానే.

post top

ఆర్ జి ఎమ్ బ్యానర్ పై సత్యవతి సమర్పించిన ఎస్. వి రెడ్డి నిర్మాణంలో ‘నాలో నిన్ను దాచానే’ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా మీ అభిమాన థియేటర్ లలో విడుదలయ్యింది. పసలపూడి రామ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఉప్పలపాటి వికాస్, నటించారు, టిక్ టాక్ లో అందరికీ సుపరిచితమైన దుర్గారావు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ…. నేటి సమాజంలో ప్రేమ గురించి చర్చించడం జరిగిందని, అలాగే తండ్రీ కూతుర్ల మధ్య ప్రేమానురాగాల తాలూకా ఎమోషన్ ని ఆవిష్కరించడం జరిగింది అని అన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, చిత్రంలోని పాటలు, విశేష ఆదరణ లభించిందని, చిత్రాన్ని కూడా అదే విధంగా ఆదరించాలని ఈ సందర్భంగా అన్నారు. సినిమా మీద ప్యాషన్ తో కొత్త నటీనటులతో భారీగా చిత్రీకరించామని ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.