The South9
The news is by your side.
after image

వైయస్ షర్మిల పార్టీకి, మాకు ఎటువంటి సంబంధం లేదు.. సజ్జల రామకృష్ణారెడ్డి

post top

వైయస్ షర్మిల లోటస్ పాండ్ లోఈరోజు నల్గొండ జిల్లా అభిమానులతో ఏర్పాటుచేసిన సమావేశం అనంతరం ఒక్కసారిగా పలు రాజకీయ అనుమానాలు రేకెత్తించాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి సమ్మతి ఉందా లేక వైయస్ షర్మిల సొంత నిర్ణయమా అనే సందేహాలను పటాపంచలు చేస్తూ …… ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ వద్దని షర్మిలకు నచ్చజెప్పాం:
తెలంగాణలో వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ పై మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీ పెట్టొద్దని షర్మిలకు నచ్చజెప్పే ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. షర్మిల తమ ఆత్మీయ సోదరని, గత మూడు నెలలుగా పార్టీ ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో వైసీపీలాంటి పార్టీ ఉండాలని షర్మిల భావించి ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. 2 రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతినకూడదనే.. వైసీపీని తెలంగాణలో విస్తరించలేదని తేల్చి చెప్పారు. షర్మిలను పార్టీ పెట్టొద్దని నచ్చజెప్పే ప్రయత్నాలు జరిగాయని, జగన్‌, షర్మిల మధ్య వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. తెలంగాణలో సుదీర్ఘకాలం షర్మిల పాదయాత్ర చేశారని, పార్టీ నిర్ణయం, ఫలితాలను షర్మిలే చూసుకుంటారన్నారు. పార్టీని కుటుంబపరం చేశారనే విమర్శలు వస్తాయని జగన్‌ భావించారన్నారు. ఈ నిర్ణయం పూర్తిగా షర్మిల సొంత నిర్ణయమని, దీంట్లో వైయస్సార్సీపి పార్టీకి ఇటువంటి సంబంధం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Post midle

Comments are closed.