
తొలి దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ……
ఏపీ తొలిదశ పంచాయితీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడం సంతోషదాయకం..
పెద్ద సంఖ్యలో ఓటర్లు స్వచ్ఛందంగా,ఉత్సాహంతో పాల్గొనడం ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరుస్తుందని SEC భావిస్తోంది…
ఎన్నికల సిబ్బంది అంకిత భావంతో, నిబంధనలతో పనిచేయడం సంతోషాదాయకం…

ముఖ్యంగా పోలీస్ సిబ్బంది శాంతిభద్రతల నిర్వహణ సవాల్ గా తీసుకొని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు…
పోలీస్ సిబ్బందిని అభినందిస్తున్నాను…
తొలిదశ ఎన్నికలలో జిల్లా కలెక్టర్లు,ఎస్పీ,ఎన్నికల పరిశీలకులు పూర్తి సమన్వయంతో వ్యవహరించిన తీరు మంచి ఫలితాలు ఇచ్చింది…

రెండవ దశ ఎన్నికలలో ప్రజలు స్వేచ్ఛగా ఎన్నికలలో పాల్గొని ఓటు హక్కుని వినియోగించుకోవాలి… అని అన్నారు.
Comments are closed.