రియా వెల్లడించిన పేర్లపై ఎన్సీబీ నిఘా
తాను కూడా డ్రగ్స్ తీసుకుంటానని వెల్లడించిన రియా
బాలీవుడ్లో కదులుతున్న డొంక
బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతితో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్, తెలుగులో పలు చిత్రాల్లో నటించిన రకుల్ ప్రీత్ సింగ్, నటుడు రణ్వీర్ సింగ్ సన్నిహితురాలు, డిజైనర్ సిమోన్ ఖంబట్ట పేర్లు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

విచారణలో భాగంగా రియా చక్రవర్తి వీరి పేర్లను వెల్లడించినట్టు తెలుస్తోంది. దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) వీరిపై నిఘా పెట్టినట్టు సమాచారం. వీరితోపాటు బాలీవుడ్లోని పలువురిపై ఇప్పుడు ఎన్సీబీ నిఘాపెట్టినట్టు ‘టైమ్స్ నౌ’ పేర్కొంది. విచారణలో భాగంగా రియా చక్రవర్తి ప్రత్యేకంగా పై పేర్లను వెల్లడించినట్టు టైమ్స్ నౌ తన కథనంలో పేర్కొంది. కాగా, తాను మాదకద్రవ్యాలు తీసుకోనని తొలుత చెప్పిన రియా.. ఆ తర్వాత తాను కూడా డ్రగ్స్ తీసుకుంటానని విచారణలో అంగీకరించినట్టు సమాచారం.
Tags: Rakul Preet Singh, Sara Ali Khan, Bollywood, Rhea Chakraborty, Sushant Singh Rajput



Comments are closed.