ఏపీ పాలనా యంత్రాంగంలో అత్యంత కీలక మార్పు జరిగింది. రాష్ట్ర నూతన చీఫ్ సెక్రటరీగా ఆదిత్యనాథ్ దాస్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం సీఎస్ గా వ్యవహరిస్తున్న నీలం సాహ్నీ ఈ నెల 31తో పదవీవిరమణ చేస్తున్నారు. సాహ్నీ స్థానంలో ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ ను నియమించింది.
అటు, సీఎస్ పదవి నుంచి తప్పుకోనున్న నీలం సాహ్నీకి జగన్ సర్కారు సముచిత స్థానం కల్పించింది. ఆమెను సీఎం ముఖ్య సలహాదారుగా నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ముఖ్య సలహాదారుగా ఆమెకు క్యాబినెట్ మంత్రి హోదా కల్పించనున్నారు. తన నూతన బాధ్యతల్లో భాగంగా నీలం సాహ్నీ ఆరోగ్యం, కొవిడ్ మేనేజ్ మెంట్, రాష్ట్ర-కేంద్ర సంబంధాలు, విభజన అంశాలు, పాలనా పరమైన సంస్కరణలు వంటి అంశాలను పర్యవేక్షిస్తారు.
Comments are closed.