The South9
The news is by your side.

జగన్ పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలుకు అనుమతి ఇవ్వండి: లాయర్ అశ్విని ఉపాధ్యాయ

post top

సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వీ రమణపై తీవ్ర ఆరోపణలు చేస్తూ సీజేఐకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారుడు అజయ్ కల్లం మీడియా ముఖంగా వెల్లడించిన తర్వాత కలకలం రేగింది. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ జగన్ పై సుప్రీంకోర్టులో ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కు సుప్రీంకోర్టు లాయర్ అశ్విని ఉపాధ్యాయ లేఖ రాశారు.

after image

సీజేఐకి జగన్ రాసిన లేఖను బయట పెట్టడం ముమ్మాటికీ కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని లేఖలో ఆయన పేర్కొన్నారు. 31 కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి కోర్టులను, జడ్జిలను బెదిరించేలా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. జగన్ పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. మరోవైపు జగన్ ను సీఎం పదవి నుంచి తొలగించాలని సీజేఐకి కూడా లేఖ రాశారు. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని గతంలో ఆయన పిటిషన్ వేశారు.
Tags: Justice Ramana, Supreme Court, ashwini upadhyay, ys jaganmohan reddy vs judicial, court petition to be filed against Jagan

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.