The South9
The news is by your side.

రాష్ట్రములోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్ లో హెల్ప్ డెస్క్ లు: మంత్రి ఆళ్ల నాని

post top

రాష్ట్రములోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్ లో హెల్ప్ డెస్క్ లు తక్షణమే ఏర్పాటు చేస్తూ జి ఓ రూపంలో మార్గ దర్శకాలు జారీ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 670అన్ని ఆరోగ్య శ్రీ హాస్పిటల్స్ లో ఆరోగ్య మిత్రలు వెంటనే ఏర్పాటు చేయాలని 1కోటి 34లక్షలు రూపాయలు విడుదల చేస్తూ ఫైల్ పై సంతకం చేసిన మంత్రి ఆళ్ల నాని. ఈ మేరకు ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆరోగ్య మిత్రలు ఏర్పాటుకు సోమవారం ఫైల్ పై సంతకం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి అదేషాలతో ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్ లో హెల్ప్ డెస్క్ లు సత్వరమే ఏర్పాటుకు సన్నాహాలు. మొత్తం ఎంపేనల్డు హాస్పిటల్స్ లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి రోగులకు వైద్య సహాయం అందించడమే ఆరోగ్య మిత్రలు లక్ష్యం.

వైద్యం కోసం వచ్చే రోగులకు అవసరం మేరకు అంబులెన్సు సౌకర్యం కల్పించడం ఆరోగ్య మిత్రల బాధ్యత. రోగులకు అవసరమైన వైద్యం కోసం వేరే హాస్పిటల్కు పంపించే బాధ్యత కూడ ఆరోగ్య మిత్రలదే. ప్రతి హాస్పిటల్ లో రోజంతా ఆరోగ్య మిత్రలు సేవలు అందించాలి. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ అనిల్ కుమార్ సిo ఘాల్ కు జిఓ జారీ చేయాలని మంత్రి ఆళ్ల నాని ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల 19న ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో ఆరోగ్య శ్రీ హెల్ప్ డెస్క్ ల పై చర్చించిన విషయం విదితమే…

after image

ప్రతి ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ హాస్పిటల్ కు హెల్ప్ డెస్క్ ఏర్పాటుకు 20వేలు రూపాయలు మంజూరు చేస్తూ జి ఓ జారీ. ఆంధ్రప్రదేశ్ లో 560, ఇతర రాష్ట్రాల్లో 110, మొత్తం ఆరోగ్య శ్రీ హాస్పిటల్స్ కు 1కోటి 34లక్షలు రూపాయలు మంజూరుకు ఆదేశాలు ఇచ్చారు. అన్ని జిల్లాల కలెక్టర్లు పర్యవేక్షణలో జిల్లాల జాయింట్ కలెక్టర్లు జిల్లా పర్చే జ్ కమిటీ ల ద్వారా టెండర్లు ప్రక్రియలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు…

ప్రతి హెల్ప్ డెస్క్ వెనుక ఆరోగ్య శ్రీ పోస్టర్ పూర్తి వివరాలతో ఉండాలి.హెల్ప్ డెస్క్ ల్లో కేవలం కూర్చోవడమే కాకుండా ఆరోగ్య మిత్రలు రోగులకు సహాయం చేయాలి. రోగుల నుండి గాని, హాస్పిటల్స్ నుండి గాని ఆరోగ్య మిత్రలు లంచాలు ఆశించకుండా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ఆరోగ్య మిత్ర ప్రతి రోజూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణికి 4అంశాలతో నివేదిక ఇవ్వాలి. హాస్పిటల్స్ లో వైద్య సదుపాయాలు, వైద్యుల అందుబాటు, మందులు అందుబాటు, వైద్య సేవలపై రోజూ నివేదిక ఇవ్వాలి. ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్ లో ఆరోగ్య మిత్రలు హెల్ప్ డెస్క్ లు ద్వారా సేవలు అందేలా జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు పర్యవేక్షణ చేయాలి.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.