బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్2021 డైరీ ఆవిష్కరణ..
ఆంధ్ర ప్రదేశ్ మీడియా ఫెడరేషన్ 2021డైరీ ఆవిష్కరణ
రాజమండ్రిలో శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు ఆంధ్ర ప్రదేశ్ మీడియా ఫెడరేషన్ 2021వ సంవత్సరం డైరీ ఆనందోత్సాహాల మధ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏ. పీ .ఎం .యఫ్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ఢిల్లీ బాబు రెడ్డి,ఐ. వెంకట రామరాజు, చెల్లుబోయిన శ్రీనివాసులు, సురేష్ కుమార్ రెడ్డి, స్వామి నాయుడు, శీలం సాంబయ్య, ప్రసాద్, స్వామి నాయుడు, మన పాటి చక్రవర్తి, ఎం.సీ.హెచ్. సుబ్బారెడ్డి మరియు రాష్ట్రంలోని పలు జిల్లాల ఏ పీ ఎం ఎఫ్ నాయకులు, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఏపీ ఎంఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీబాబు రెడ్డి రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి రాష్ట్ర బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు కి సోదాహరణంగా వివరించారు. సోము వీర్రాజు ని జర్నలిస్టు సమస్యల పరిష్కారం కోసం సహకారం అందించివలసిందిగా కోరారు.
Comments are closed.