The South9
The news is by your side.

కృష్ణపట్నం ఆయుర్వేద మందు పరిశీలనకు ఐసీఎంఆర్ బృందం రాక.

నెల్లూరు ప్రతినిధి : గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో విస్తృత ప్రచారం కలిగిన నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం నందు గల ఆయుర్వేద మందు పంపిణీ కార్యక్రమం ఈరోజు జన సందోహం మధ్య స్థానిక ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. చుట్టుపక్కల జిల్లాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 50 వేల మంది దాకా ప్రజలు అక్కడికి చేరుకున్నారు అనేది సమాచారం . ఈ నేపథ్యంలో మందు తయారు చేసినటువంటి ఆనందయ్య కేవలం మూడు వేల మందికి మాత్రమే తయారయిందని తెలిపారు. ప్రభుత్వం అనుమతిస్తే రెండు రోజుల్లో ముందు తయారీకి కావాల్సిన ముడి సరుకు సేకరించి మిగతా వారికి కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఆనందయ్య తెలిపారు.                                                                                         పంపిణీ కార్యక్రమం పూర్తవగానే స్థానిక ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి తో కలిసి నెల్లూరు జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కాకాని మాట్లాడుతూ… ఆనందయ్య మొదటినుంచి ప్రజాసేవలో ఉన్నారు,
ఈరోజు సాయంత్రం ఐసీఎంఆర్ బృందం నెల్లూరు కి చేరుకుంటుంది
ఇతర రాష్ట్రాల నుంచి కరోనా మందు కోసం ఎవరూ రావద్దు అని చెప్పారు.
వేల మంది రావడం వల్ల పోలీసులు కూడా నియంత్రించలేని పరిస్థితి ఏర్పడుతోంది అని,
ఈరోజు సాయంత్రం నాటికి ఆయుష్ అనుమతులు కూడా వస్తాయని భావిస్తున్నాము
ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ప్రభుత్వ అనుమతులు, క్లీన్ చిట్ వస్తే రాష్ట్రాల వారికి కొరియర్ చార్జీలు కూడా మేమే భరించి మందులు పంపిణీ చేస్తాం అని   కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు.

 

Post midle

Leave A Reply

Your email address will not be published.