గుంటూరు: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కె.అచ్చెన్నాయుడు డిశ్చార్జీ అయ్యారు. ఆరోగ్యం కుదుటపడినందుకు అచ్చెన్నాయుడిని డిశ్చార్జీ చేస్తున్నామని గుంటూరు ఆసుపత్రి వైద్యులు ఏసీబీ కి సమాచారం ఇచ్చారు.
ఈ విషయం తెలియడంతో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు ప్రభుత్వ ఆసుపత్రి వరకు చేరుకున్నాయి. ఏసీబీ అధికారులు అచ్చన్నను విజయవాడ సబ్ జైలుకు తరలించారు. అయితే అచ్చెన్నాయుడు కేసుపై ఇవాళ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఆరోగ్యం బాగా లేనందుకు బెయిల్ మంజూరు చేయాలని పిటీషనర్ తరఫు న్యాయవాది కోరారు.
కోర్టు ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉంటారని న్యాయవాది విన్నవించారు. ఎల్లుండి తీర్పును వెలువరించనున్న ఏసీబీ కోర్టు. వాదనల తరువాత ఏసీబీ కోర్టు జడ్జీ తీర్పును రిజర్వ్ లో పెట్టారు.
Comments are closed.