
హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డులో పనిచేస్తున 18 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ సోకింది. దీంతో మిగతా ఉద్యోగులు హడలి పోతున్నారు.
ఈ విషయం తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు వారితో కలిసి పనిచేసిన బోర్డు ఉద్యోగులు, సన్నిహితులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులు రావాల్సి ఉంది. మొత్తం 139 మంది నుంచి నమూనాలు సేకరంచి పంపించగా, 89 మంది ఫలితాలు వచ్చాయి. ఈ విషయం తెలిసిన ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయిస్తున్నారు.
ఇంటర్మీడియెట్ వాల్యుకేషన్ కోసం ఉద్యోగులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వారు వాల్యుయేషన్ కేంద్రాలకు వెళ్లడంతో పాటు కొందరితో సన్నిహితంగా తిరిగారు. భౌతిక దూరం పాటించకుండా తిరగడం మూలంగానే కరోనా వైరస్ సోకిందనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Comments are closed.